Share News

JEE 2025 Results: 110 మంది అభ్యర్థుల ఫలితాలు నిలుపుదల.. కారణమిదే..

ABN , Publish Date - Apr 19 , 2025 | 11:38 AM

దేశ వ్యాప్తంగా విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్ కీ విడుదల చేసిన ఎన్‌టీఏ తాజాగా, విద్యార్థుల పర్సంటై‌ల్ స్కోర్‌ను విడుదల చేసింది. అయితే..

JEE 2025 Results: 110 మంది అభ్యర్థుల ఫలితాలు నిలుపుదల.. కారణమిదే..

దేశ వ్యాప్తంగా విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్ కీ విడుదల చేసిన ఎన్‌టీఏ తాజాగా, విద్యార్థుల పర్సంటై‌ల్ స్కోర్‌ను విడుదల చేసింది. అయితే ఈ క్రమంలో అక్రమాలకు పాల్పడ్డారనే కారణంలో సుమారు 110 మంది అభ్యర్థుల ఫలితాలను ఏన్టీఏ అధికారులు నిలుపుదల చేశారు. వివరాల్లోకి వెళితే..


దేశంలోనే ప్రాముఖ్యత సంతరించుకున్న పోటీ పరీక్షల్లో ఒకటైన జేఈఈ (JEE 2025) పరీక్షలను అధికారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంటారు. బయోమెట్రిక్, AI ఆధారిత వీడియో విశ్లేషణతో పాటూ సీసీ కెమెరాల ద్వారా ప్రత్యక్ష నిఘాను ఏర్పాటు చేశారు. దీనికితోడు 5G జామర్లను కూడా ఏర్పాటు చేశారు. అయినా 110 మంది అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. అభ్యర్థులు ఫోర్జరీ దస్త్రాలను ఉపయోగించారని, ఈ కారణంగా వారి ఫలితాలను నిలుపుదల చేసినట్లు చెబుతున్నారు.


ఇదిలావుండగా, మొత్తం 24 మంది విద్యార్థులు 100కి వంద పర్సంటైల్‌ సాధించిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌కు చెందిన మహ్మద్‌ అనాస్‌ ఫస్ట్‌ ర్యాంకు సాధించారు. అలాగే ఆయుష్‌ సింఘాల్‌ రెండో ర్యాంక్‌ సాధించారు. అలాగే వంద పర్సంటైల్‌ సాధించిన వారిలో తెలంగాణకు చెందిన హర్ష గుప్తా, వంగల అజయ్‌రెడ్డి, బనిబ్రత మజీ ఉండగా.. ఏపీ నుంచి సాయిమనోజ్ఞ ఉన్నారు. హర్ష ఏ గుప్తా దేశవ్యాప్తంగా ఎనిమిదో ర్యాంక్‌ని సాధించగా.. అజయ్‌రెడ్డికి ఆలిండియా 16వ ర్యాంక్‌తో పాటూ ఈడబ్ల్యూస్‌ కేటగిరిలో ఒకటో ర్యాంక్‌లో నిలిచారు. మరోవైపు సాయిమనోజ్ఞ ఆలిండియా 22వ ర్యాంక్‌, బాలికల్లో రెండో ర్యాంక్‌ సాధించింది. అలాగే బనిబత్ర మజీ ఆల్‌ఇండియా 24వ ర్యాంకు సాధించింది.

Updated Date - Apr 19 , 2025 | 11:38 AM