NPCIL Recruitment 2025: బీటెక్ లేదా డిగ్రీ చేశారా.. NPCILలో 400 పోస్టులకు నోటిఫికేషన్.. స్టైపెండ్ రూ.74,000..
ABN , Publish Date - Apr 28 , 2025 | 02:09 PM
NPCIL Executive Trainee Recruitment 2025: నిరుద్యోగులు గుడ్ న్యూస్. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCIL) 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టైపెండ్ రూ.74,000. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

NPCIL Executive Trainee Recruitment 2025: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCIL) ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 30. అంటే ఇంకో రెండ్రోజులే గడువుంది. కాబట్టి, వెంటనే ఆసక్తిగల అభ్యర్థులు ఆలస్యం చేయకుండా NPCIL అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోండి.
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCIL) 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు BE/BTech/BSc (ఇంజనీరింగ్) గ్రాడ్యుయేట్లు, GATE 2023/24/25 స్కోర్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ వంటి అనేక శాఖల్లో అర్హత పొందిన వారికి శిక్షణ ఉంటుంది. నెలకు రూ.74,000 స్టైపెండ్, రూ.30,000 పుస్తక భత్యం వస్తుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ 30.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో కనీసం 60% మార్కులతో బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ డిగ్రీ లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ MTech డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. GATE 2023/24/25 స్కోర్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
గమనిక: దరఖాస్తుదారులు అర్హత పొందిన డిగ్రీ సబ్జెక్టుగా అదే ఇంజనీరింగ్ విభాగంలో చెల్లుబాటు అయ్యే GATE 2023, 2024 లేదా GATE 2025 మార్కులను కలిగి ఉండాలి. 2022, అంతకు ముందు సంవత్సరాల గేట్ స్కోర్‌లు పరిగణనలోకి తీసుకోరు.
గరిష్ఠ వయోపరిమితి:
జనరల్/EWS - 26 సంవత్సరాలు, OBC (నాన్-స్కిమ్డ్ లేయర్)- 29 సంవత్సరాలు, SC/ST - 31 సంవత్సరాలు
స్టైపెండ్: రూ. 74,000.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఇంటర్వ్యూలు జూన్ 9 నుంచి 21 వరకు జరిగే అవకాశం ఉంది.
దరఖాస్తు రుసుము: జనరల్, OBC కేటగిరీ, EWS వారికి రూ.500. SC/ST వర్గం, వికలాంగులు, మహిళలకు ఉచితం.
దరఖాస్తు విధానం:
ముందుగా NPCIL అధికారిక వెబ్‌సైట్ (npcilcareers.co.in) కు లాగిన్ అయ్యి కెరీర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
న్యూ పేజీలో మీరు 'Recruitment Of Executive Trainees (2025) In NPCIL Through Gate 2023/2024/2025' అనే ఆప్షన్ ఎంచుకోండి.
'Apply Online' పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి.
ఇప్పుడు లాగిన్ అవ్వండి. దరఖాస్తు ఫారమ్ నింపి రుసుము చెల్లించండి.
దరఖాస్తును Submit చేయండి. భవిష్యత్తు అవసరాల కోసం దాన్ని ప్రింటవుట్ తీసుకొని ఉంచుకోండి..
ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థులను ప్రత్యక్ష ఇంటర్వ్యూ చేసి షార్ట్‌లిస్ట్ చేస్తారు. గేట్ స్కోర్‌ల ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు. గేట్ స్కోరు, ఇంటర్వ్యూలో పొందిన స్కోర్‌లను కలిపి పరిగణనలోకి తీసుకుంటారు. జూన్ 9 నుంచి జూన్ 21 వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు మార్కుల షీట్లు, డిగ్రీ సర్టిఫికెట్లు సహా ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు NPCIL అధికారిక వెబ్‌సైట్ npcil.nic.in ని సందర్శించండి .
ఇంటర్వ్యూ కేంద్రాలు:
కైగా మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్ (KGS), కర్ణాటక
అనుశక్తి నగర్, ముంబై (మహారాష్ట్ర)
నరోరా అణు విద్యుత్ కేంద్రం (NAPS), ఉత్తరప్రదేశ్
మద్రాస్ అణు విద్యుత్ కేంద్రం (MAPS), తమిళనాడు
Read Also: Indian Army Internship:ఆర్మీలో చేరాలనుకునే యువతకు గోల్డెన్ ఛాన్స్.. ఈ ఇంటర్న్‌షిప్ చేస్తే..
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
RRB JE Exam Cancelled: ఏప్రిల్ 22న జరిగిన RRB JE పరీక్ష రద్దు.. మళ్లీ ఎప్పుడంటే..