JNTU: 30న జేఎన్‌టీయూ ‘వన్‌టైమ్ చాన్స్’ పరీక్షల ఫలితాలు
ABN , Publish Date - Jul 29 , 2025 | 07:19 AM
జేఎన్‌టీయూ ‘వన్‌టైమ్ చాన్స్’ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేసేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు స్పందిస్తూ.. రెండు రోజుల్లో ఫలితాలను విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు.

హైదరాబాద్ సిటీ: జేఎన్‌టీయూ(JNTU) ‘వన్‌టైమ్ చాన్స్’ పరీక్షల ఫలితాలను బుధవారం(జూలై 30) విడుదల చేసేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు(JNTU Registrar Venkateswara Rao) స్పందిస్తూ.. రెండు రోజుల్లో ఫలితాలను విడుదల చేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు. పదేళ్లకు ముందు ఇంజనీరింగ్, ఫార్మసీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్ కోర్సులు చదివిన పూర్వ విద్యార్థుల్లో,
తమ బ్యాక్‌లాగ్ సబ్జెక్టులను పూర్తి చేయలేక పోయిన వారి కోసం జేఎన్‌టీయూ ’వన్‌టైమ్ చాన్స్’ పేరిట మరో అవకాశాన్ని ఇచ్చింది. సుమారు రెండు వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. జూన్ నెలాఖరులోగా ఫలితాలు వస్తాయని అభ్యర్థులు ఆశించారు. అయితే, సుమారు 25వేలకు జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి రావడం, 20 ఏళ్ల కిందటి సబ్జెక్టుల జవాబు పత్రాలను దిద్దేందుకు ఆచార్యులు దొరకక పోవడంతో ఫలితాల వెల్లడిలో జాప్యం ఏర్పడినట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు
ప్రధాని మోదీని బీసీ కాదనడం సిగ్గుచేటు
Read Latest Telangana News and National News