JNTU: జేఎన్టీయూలో పీహెచ్డీ ప్రవేశాలకు మోక్షం..
ABN , Publish Date - Oct 17 , 2025 | 07:58 AM
ఎట్టకేలకు జేఎన్టీయూలో పీహెచ్డీ ప్రవేశాలకు మోక్షం లభించింది. సెప్టెంబరులో నిర్వహించిన ప్రవేశపరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు నెలరోజులుగా అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అర్హులైన అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలనకు తాజాగా అడ్మిషన్ల విభాగం అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు.
హైదరాబాద్ సిటీ: ఎట్టకేలకు జేఎన్టీయూ(JNTU)లో పీహెచ్డీ ప్రవేశాలకు మోక్షం లభించింది. సెప్టెంబరులో నిర్వహించిన ప్రవేశపరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు నెలరోజులుగా అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అర్హులైన అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలనకు తాజాగా అడ్మిషన్ల విభాగం అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 24నుంచి 26వరకు మూడురోజుల పాటు వివిధ ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలకు సంబంధించిన అభ్యర్థులు వారికి నిర్ధేశించిన రోజుల్లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుందని షెడ్యూల్లో పేర్కొన్నారు.

24న సివిల్, మేథమ్యాటిక్స్, ఫిజిక్స్, నానో సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వాటర్ రిసోర్సెస్, 25న కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్, 26న మేనేజ్మెంట్ సైన్స్, ఫార్మాస్యూటికల్ సైన్స్, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఇంగ్లిష్ విభాగాలకు చెందిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన జరగనుందని అడ్మిషన్ల విభాగం డైరెక్టర్ బాలునాయక్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
Read Latest Telangana News and National News