Share News

JNTU: జియో స్పేషియల్‌లో జేఎన్‌టీయూకు అవార్డు

ABN , Publish Date - Jul 11 , 2025 | 07:43 AM

జియో స్పేషియల్‌ సైన్స్‌ రంగంలో జేఎన్‌టీయూ(JNTU) చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

JNTU: జియో స్పేషియల్‌లో జేఎన్‌టీయూకు అవార్డు

హైదరాబాద్‌ సిటీ: జియో స్పేషియల్‌ సైన్స్‌ రంగంలో జేఎన్‌టీయూ(JNTU) చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఐఐటీ ముంబై నిర్వహిస్తున్న ఫ్రీ అండ్‌ ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌ ఎడ్యుకేషన్‌ (ఎఫ్‌ఓఎస్ఎస్ఈ) ప్రాజెక్టు తరుఫున జేఎన్‌టీయూను ఉత్తమ యూనివర్సిటీ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ పురస్కారాన్ని జూలై 17న ఐఐటీ ముంబైలో నిర్వహించనున్న ఓపెన్‌ సోర్స్‌ జీఐఎస్‌ దినోత్సవంలో ప్రదానం చేయనున్నారు.


city3.2.gif

జియో స్పేషియల్‌ సైన్స్‌లో విద్య, పరిశోధన, సామాజిక అవగాహనను పెంపొందించడం వంటి అంశాల్లో వర్సిటీ చేపట్టిన కార్యక్రమాలకు ఈ గుర్తింపు లభించడం పట్ల ఆచార్యులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, విశ్వ విద్యాలయంలోని పర్యావరణ శాస్త్ర విభాగంలో పనిచేస్తున్న అసోసియేట్‌ ప్రొఫెసర్‌ విజయలక్ష్మికి కూడా జియో స్పేషియల్‌ సైన్స్‌ అవార్డు లభించింది.


ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం కొనాలనుకునే వారికి షాక్.. పెరిగిన బంగారం ధరలు..

నకిలీ పోలీసుల ముఠా గుట్టు రట్టు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 11 , 2025 | 07:43 AM