Constable Jobs 2025: కానిస్టేబుల్ జాబ్స్‌కు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..
ABN , Publish Date - Mar 11 , 2025 | 06:03 PM
Constable Recruitment 2025:టెన్త్, ఇంటర్ లేదా డిగ్రీ పాసైన నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్ న్యూస్. కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకానికి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఆరంభమైంది.ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీకి ముందే అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోండి. పోస్టులు, అర్హత, చివరి తేదీ తదితర పూర్తి వివరాల కోసం..

ITBP Constable Recruitment 2025: కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించాలనే యువతీ యువకులకు శుభవార్త. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) స్పోర్ట్స్ కోటా కింద కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది.ఈ నియామకం గ్రూప్ 'సి' (నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్) కింద జరుగుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులందరూ ITBP recruitment.itbpolice.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఈ నియామకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 2, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు చివరి తేదీకి ముందే తమ దరఖాస్తును సమర్పించండి.
గ్రూప్ 'సి'లో స్పోర్ట్స్ కోటా కింద కానిస్టేబుళ్ల నియామకాలకు ITBP ప్రకటన విడుదల చేసింది.అర్హతగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించవచ్చు. దరఖాస్తు ప్రక్రియ మార్చి 4 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 2న రాత్రి 11:59 గంటల వరకు కొనసాగుతుంది.
విద్యార్హత
ఈ నియామకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పాస్ (మెట్రిక్యులేషన్), ఇంటర్మీడియట్ (12వ తరగతి పాస్) లేదా గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉండాలి. పోస్ట్‌ను బట్టి అభ్యర్థులు తమ అర్హతకు సంబంధించిన విద్యా ధృవీకరణ పత్రాలను సమర్పించాలి.
అంతేకాకుండా, క్రీడా విజయాలు లేదా NCC (నేషనల్ క్యాడెట్ కార్ప్స్) సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులకు మొత్తం మార్కులలో అదనపు ప్రయోజనం ఉంటుంది.
వయోపరిమితి
ఈ నియామకానికి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి వయస్సు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. వయస్సును 2025 ఏప్రిల్ 3 నాటికి లెక్కిస్తారు. ఇది ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్ని వర్గాల అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.అన్‌రిజర్వ్డ్ (జనరల్) కేటగిరీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 5 సంవత్సరాల సడలింపు,
షెడ్యూల్డ్ కులం (SC) మరియు షెడ్యూల్డ్ తెగ (ST) అభ్యర్థులకు 10 సంవత్సరాలు (5+5) సడలింపు ఇవ్వబడుతుంది. ఇతర వెనుకబడిన తరగతులు (OBC – నాన్ క్రీమీ లేయర్) అభ్యర్థులకు 8 సంవత్సరాలు (5+3) సడలింపు ఇవ్వబడుతుంది.
డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ప్రత్యేక సడలింపు:
ఏదైనా ప్రభుత్వ విభాగంలో ఇప్పటికే ఉద్యోగం చేస్తూ కనీసం 3 సంవత్సరాల నిరంతర సేవను పూర్తి చేసిన అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది. అభ్యర్థులు షెడ్యూల్డ్ కులం (SC) లేదా షెడ్యూల్డ్ తెగ (ST) కు చెందినవారైతే వారికి అదనంగా 5 సంవత్సరాల సడలింపు లభిస్తుంది. ఇతర వెనుకబడిన తరగతుల (OBC - నాన్ క్రీమీ లేయర్)కు అదనంగా 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము
అన్‌రిజర్వ్డ్ (UR), ఇతర వెనుకబడిన తరగతులు (OBC), ఆర్థికంగా బలహీన వర్గాల (EWS)కు చెందిన పురుష అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 100. ఈ రుసుమును ITBPF అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో జమ చేయాలి. మరే ఇతర పద్ధతిలో చెల్లించినా రుసుము అంగీకరించరు. దరఖాస్తు తిరస్కరించబడుతుంది. మహిళా అభ్యర్థులు, షెడ్యూల్డ్ కులం (SC), షెడ్యూల్డ్ తెగ (ST) కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుములో పూర్తి మినహాయింపు ఉంటుంది.
Read Also : UBI Recruitment: యూనియన్ బ్యాంక్‌లో 2000లకు పైగా నోటిఫికేషన్.. దరఖాస్తు తేదీ పొడిగింపు..ఇదే చివరి అవకాశం..
Railway Jobs : టెన్త్ అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి..