Bank Jobs: IDBI బ్యాంకులో భారీ నియామకాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..
ABN , Publish Date - May 15 , 2025 | 09:46 AM
IDBI Recruitment 2025: డిగ్రీ కంప్లీట్ చేసిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. IDBI బ్యాంకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. మీరు గ్రాడ్యుయేట్ అయితే ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.

IDBI Bank JAM Recruitment 2025: బ్యాంకులో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కోరుకునే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఐడీబీఐ బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 8, 2025 నుంచే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 20 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 676 పోస్టులను భర్తీ చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు కింద ఇచ్చిన వెబ్‌సైట్ లింక్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
IDBI బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) గ్రేడ్ 'O' రిక్రూట్‌మెంట్ ఇయర్ 2025-26 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (idbibank.in) ని సందర్శించడం ద్వారా ఈ పోస్టులకు 20 మే 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియ కింద మొత్తం 676 ఖాళీ పోస్టులను భర్తీ చేస్తారు. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు జూన్ 8, 2025న ఆన్‌లైన్ పరీక్ష జరిగే అవకాశం ఉంది.
అర్హత
ఈ నియామకాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి.
జనరల్, EWS, OBC కేటగిరీ అభ్యర్థులకు కనీసం 60% మార్కులు తప్పనిసరి. షెడ్యూల్డ్ కులం (SC), షెడ్యూల్డ్ తెగ (ST), వికలాంగ (PwBD) అభ్యర్థులు కనీసం 55% మార్కులు తప్పనిసరి.
మే 1, 2025 నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తుకు అర్హులు.
ఎంపిక ప్రక్రియలో మార్క్ షీట్లు, డిగ్రీ సర్టిఫికెట్లు వంటి పత్రాలు అవసరం కాబట్టి అభ్యర్థులు ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి.
వయోపరిమితి
మే 1, 2025 నాటికి అభ్యర్థుల వయోపరిమితి 20-25 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివితే మంచిది.
దరఖాస్తు రుసుము
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే SC/ST/PWD కేటగిరీ అభ్యర్థులు రూ. 250 దరఖాస్తు రుసుము చెల్లించాలి. మిగిలిన అభ్యర్థులందరికీ రూ. 1050 రుసుము వర్తిస్తుంది.
దరఖాస్తు చేసుకునే విధానం
ముందుగా మీరు అధికారిక వెబ్‌సైట్ (idbibank.in) కి వెళ్లండి.
ఇప్పుడు హోమ్‌పేజీకి వెళ్లి “career” విభాగంపై క్లిక్ చేయండి.
తరువాత, “జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) గ్రేడ్ 'O' నియామకం 2025-26” లింక్‌పై క్లిక్ చేయండి.
ముందుగా రిజిస్టర్ చేసుకుని ఆపై దరఖాస్తు ప్రక్రియను కొనసాగించండి.
దరఖాస్తు ఫారమ్ నింపండి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయడం పూర్తయ్యాక చివరగా రుసుము చెల్లించండి.
అప్లికేషన్ ఫారమ్ సబ్మిట్ తర్వాత సాఫ్ట్ కాపీని డౌన్లోడ్ చేసిపెట్టుకోండి.
Read Also: CISF: ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు..నెలకు రూ.81 వేల జీతం సహా..
AP POLYCET Results 2025: పాలిసెట్ ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..
JNTU: జేఎన్‌టీయూ కాలేజీలో 500 సీట్లకు కోత..