Share News

IBPS RRB Recruitment 2025: కొలువుల పండుగ మళ్లీ వచ్చింది.. గ్రామీణ బ్యాంకుల్లో 13,217 పోస్టులకు నోటిఫికేషన్..

ABN , Publish Date - Sep 03 , 2025 | 06:05 PM

ఐబీపీఎస్ మరోమారు భారీ నోటిఫికేషన్ వదిలింది. ఈసారి గ్రామీణ బ్యాంకింగ్ పోస్టులకు. ప్రాంతీయ బ్యాంకుల్లో పీవో, క్లర్క్ సహా అనేక పోస్టులకు రిక్రూట్‌మెంట్‌ను విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో కొలువు కోసం చూస్తున్న అభ్యర్థులకు ఇదొక సువర్ణావకాశమనే చెప్పాలి. మరిన్ని వివరాల కోసం..

IBPS RRB Recruitment 2025: కొలువుల పండుగ మళ్లీ వచ్చింది.. గ్రామీణ బ్యాంకుల్లో 13,217 పోస్టులకు నోటిఫికేషన్..
IBPS RRB PO, Clerk and Officer Jobs 2025 13,217 Vacancies

IBPS RRB PO Clerk Recruitment 2025: ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) మరోసారి కొలువుల భర్తీకీ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో క్లర్క్, PO పోస్టులతో సహా అనేక పోస్టులకు బంపర్ రిక్రూట్‌మెంట్‌ చేపట్టనుంది. ఏకంగా 13,217 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 1, 2025 నుంచి సెప్టెంబర్ 21, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామకం ద్వారా మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-I, ఆఫీసర్ స్కేల్-II, ఆఫీసర్ స్కేల్-III పోస్టులను భర్తీ చేస్తారు.


దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో (RRBలు) క్లర్క్, ఆఫీసర్ (PO)తో సహా 13000 కంటే ఎక్కువ పోస్టులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఖాళీలను విడుదల చేసింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 1 సెప్టెంబర్ 2025 నుండి ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ibps.in ద్వారా సెప్టెంబర్ 21, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: 1 సెప్టెంబర్ 2025

  • దరఖాస్తుకు చివరి తేదీ: 21 సెప్టెంబర్ 2025

  • ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 21 సెప్టెంబర్ 2025

  • ప్రిలిమ్స్ పరీక్ష: నవంబర్ 2025

  • ప్రిలిమ్స్ ఫలితం: డిసెంబర్ 2025 / జనవరి 2026

  • మెయిన్స్ పరీక్ష: డిసెంబర్ 2025 / ఫిబ్రవరి 2026


అర్హతా ప్రమాణాలు

ఈ నియామకానికి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి గ్రాడ్యుయేట్ అయి ఉండటం తప్పనిసరి. దీనితో పాటు కొన్ని పోస్టులకు, అభ్యర్థి ఎలక్ట్రానిక్స్ / కమ్యూనికేషన్ / కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / CA / MBA / లా (LLB) / వ్యవసాయం / ఉద్యానవనం / డైరీ / యానిమల్ / వెటర్నరీ సైన్స్ / ఇంజనీరింగ్ డిగ్రీలో బ్యాచిలర్ డిగ్రీని పొంది ఉండాలి. పూర్తి అర్హత వివరాల కోసం ఒకసారి అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించండి.


వయోపరిమితి

  • IBPS RRB రిక్రూట్‌మెంట్ 2025 కోసం వయోపరిమితిని వివిధ పోస్టుల ప్రకారం నిర్ణయించారు.

  • ఆఫీస్ అసిస్టెంట్ (క్లర్క్) పోస్టుకు వయస్సు 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి.

  • ఆఫీసర్ స్కేల్-I పోస్టులకు అభ్యర్థి వయస్సు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

  • ఆఫీసర్ స్కేల్-II పోస్టులకు అభ్యర్థి వయస్సు 21-32 సంవత్సరాల మధ్య ఉండాలి.

  • ఆఫీసర్ స్కేల్-III పోస్టుకు, అభ్యర్థి వయస్సు 21- 40 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు రుసుము

ఆఫీసర్ (స్కేల్ I, II & III) SC/ST/PwBD అభ్యర్థులు రూ.175 దరఖాస్తు రుసుము చెల్లించాలి. అన్ని ఇతర కేటగిరీ అభ్యర్థులు రూ.850 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఆఫీస్ అసిస్టెంట్ (క్లర్క్) SC/ST/PwBD అభ్యర్థులు రూ.175 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. అన్ని ఇతర కేటగిరీ అభ్యర్థులు రూ.850 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.


ఎంపిక ప్రక్రియ

  • IBPS RRB నియామక ప్రక్రియ మూడు దశల్లో నిర్వహిస్తారు. అభ్యర్థిని ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

  • క్లర్క్ (ఆఫీస్ అసిస్టెంట్) పోస్టుకు, ప్రాథమిక, ప్రధాన పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

  • పీఓ (ఆఫీసర్) పోస్టుకు అభ్యర్థుల ఎంపిక ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూ ప్రక్రియ ఆధారంగా ఉంటుంది.


ఎలా దరఖాస్తు చేయాలి?

  • ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ibps.in ని ఓపెన్ చేయండి.

  • హోమ్‌పేజీలో CRP RRB XIV అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.

  • నమోదు చేసుకుని దరఖాస్తు ప్రక్రియను కొనసాగించండి.

  • ఫారమ్ ఫిల్ చేయండి. రుసుము చెల్లించాక సబ్మిట్ చేయండి.

  • భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు ఫారమ్ ప్రింటవుట్ తీసుకోండి.


ఇవి కూడా చదవండి

ఎస్బీఐ పీఓ ఫలితాలు విడుదల..ఒక్క క్లిక్‌తో ఇలా తెలుసుకోండి

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే నుంచి మరో భారీ నోటిఫికేషన్..

మరిన్ని చదువు, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 03 , 2025 | 06:42 PM