IB ACIO Vacancy 2025: డిగ్రీ హోల్డర్లకు గుడ్ న్యూస్.. ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3700కి పైగా జాబ్స్..
ABN , Publish Date - Jul 19 , 2025 | 03:27 PM
ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు ఒక సువర్ణావకాశం వచ్చింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 19, 2025 నుంచి 3,717 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) గ్రేడ్-II/ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. కేవలం డిగ్రీ అర్హత ఉంటే చాలు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం..

ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు గోల్డెన్ ఛాన్స్. డిగ్రీ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూర్ ఆఫీసర్ అయ్యే అద్భుత అవకాశం వచ్చింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 19, 2025 నుంచి 3,717 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) గ్రేడ్-II/ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.mha.gov.in ని సందర్శించడం ద్వారా 10 ఆగస్టు 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆగస్టు 12, 2025 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చు.
హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఐబీ అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II (ACIO II)/ఎగ్జిక్యూటివ్ ఎగ్జామినేషన్ 2025 కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు ఈ పోస్టులకు జులై 19, 2025 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 12, 2025. మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూడండి
కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు
జనరల్ - 1,537
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు – 442
ఓబీసీ – 946
ఎస్సీ- 566
ఎస్టీ- 226
మొత్తం పోస్ట్‌లు–3717
విద్యార్హత
అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) రిక్రూట్‌మెంట్ 2025కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. దీనితోపాటు అభ్యర్థులు ఆఫీస్ సంబంధిత పనికి అవసరమైన ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి.
వయోపరిమితి
అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు. గరిష్ఠ వయస్సు 27 సంవత్సరాలు. వయస్సు 10 ఆగస్టు 2025 తేదీ ఆధారంగా లెక్కిస్తారు. రిజర్వ్‌డ్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
దరఖాస్తు రుసుము
జనరల్, EWS, OBC వర్గాలకు చెందిన పురుష అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 650 చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన అన్ని వర్గాలకు దరఖాస్తు రుసుము రూ. 550.
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. టైర్-I (ఆబ్జెక్టివ్ టెస్ట్), టైర్-II (డిస్క్రిప్టివ్ టెస్ట్), టైర్-III (ఇంటర్వ్యూ). టైర్-Iలో 100 మార్కుల బహుళైచ్ఛిక ప్రశ్నాపత్రం ఉంటుంది. దీనిలో జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్షకు అభ్యర్థులకు 60 నిమిషాలు సమయం ఇస్తారు.
టైర్-II పరీక్ష 50 మార్కులకు ఉంటుంది. ఇందులో వ్యాస రచన (30 మార్కులు), ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ప్రెసిస్ రైటింగ్ (20 మార్కులు) ఉంటాయి. దీని తరువాత, టైర్-III అంటే ఇంటర్వ్యూ దశ 100 మార్కులకు ఉంటుంది.
జీతం వివరాలు
అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II (ఎగ్జిక్యూటివ్) ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు లెవల్-7 కింద నెలకు రూ.44,900-రూ.1,42,400 వరకూ జీతం లభిస్తుంది. ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇతర అన్ని అలవెన్సులు విడిగా అందిస్తుంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
ముందుగా www.mha.gov.in కి వెళ్లండి.
ఇప్పుడు “IB ACIO Recruitment 2025” లింక్‌పై క్లిక్ చేయండి.
నమోదు చేసుకుని లాగిన్ అవ్వండి.
దరఖాస్తు ఫారమ్‌ను జాగ్రత్తగా పూరించండి.
అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
దరఖాస్తు రుసుము చెల్లించండి.
ఫారమ్‌ను సమర్పించి దాన్ని ప్రింట్ తీసుకోండి.
ఇవి కూడా చదవండి
సిబిల్ స్కోర్ ఉందా?.. నెలకు రూ.85 వేల వరకు జీతం..
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం.. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల ఇష్టారాజ్యం
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి