Share News

CPCB Recruitment: ఇంటర్, డిగ్రీ, బీటెక్ అర్హతతో.. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిలో జాబ్స్..

ABN , Publish Date - Apr 26 , 2025 | 07:38 AM

CPCB Recruitment 2025: ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తిచేసిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 28 చివరి తేదీ. కాబట్టి, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.

CPCB Recruitment: ఇంటర్, డిగ్రీ, బీటెక్ అర్హతతో.. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిలో జాబ్స్..
CPCB Recruitment 2025

CPCB Recruitment 2025: ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు సువర్ణావకాశం. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) వివిధ పోస్టులకు నియామకాలను ప్రకటించింది. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ తదితర కోర్సులు పూర్తిచేసిన ఎవరైనా సంబంధిత పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 28, 2025 చివరి తేదీ . అంటే కేవలం రెండు రోజులే సమయం ఉంది. కాబట్టి, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cpcb.nic.in ని సందర్శించి ఈ పేజీలోని డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పర్యావరణ రంగంలో పనిచేయాలనుకునే యువతకు ఇదో అద్భుతమైన ఛాన్స్.


కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) వివిధ పోస్టులకు మొత్తం 69 ఖాళీలను దరఖాస్తులను ఆహ్వానించింది. పర్యావరణం, కాలుష్య నియంత్రణకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశం. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు కేవలం రెండు రోజులే సమయముంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయండి.


కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) సైంటిస్ట్ 'B', డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, అకౌంట్స్ అసిస్టెంట్, టెక్నికల్ సూపర్‌వైజర్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) వంటి వివిధ పోస్టులలో మొత్తం 69 ఖాళీల కోసం నియామకాలను విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు CPCB అధికారిక వెబ్‌సైట్ (cpcb.nic.in) ని సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


అర్హత

ఈ నియామకం కింద వివిధ పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. టెక్నికల్ పోస్టులకు అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. అదే అడ్మినిస్ట్రేటివ్ లేదా అసిస్టెంట్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీని పొంది ఉండటం తప్పనిసరి. కొన్ని పోస్టులకు 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేసి అధికారిక నోటిఫికేషన్ చదవండి.


వయోపరిమితి

ఈ పోస్టులకు కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు. గరిష్ఠ వయోపరిమితి 27-35 సంవత్సరాల మధ్య ఉంటుంది. పోస్టును బట్టి వయోపరిమితి మారవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీలకు (SC/ST/OBC/PwD) వయో సడలింపు ఇస్తారు. నోటిఫికేషన్‌ తేదీ ఆధారంగా వయస్సును లెక్కిస్తారు.


దరఖాస్తు రుసుము

జనరల్, OBC, EWS కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 500. SC, ST, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము ఉండదు. దరఖాస్తు రుసుమును డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ వంటి ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే చెల్లించాలి.

దరఖాస్తు చేసేందుకు డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Read Also: క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ఈ నైపుణ్యాలు ఉంటేనే ఆఫర్‌

ఎన్‌ఎండీసీలో 179 అప్రెంటిస్‌ ఖాళీలు

JEE Advanced 2025: జేఈఈ అభ్యర్థులకు అప్‌డేట్..అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్‌, ఎగ్జామ్ డేట్స్ ఆగయా..

Updated Date - Apr 26 , 2025 | 07:41 AM