Share News

CBSE: జాతీయ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ఎవరెవరు అర్హులంటే..

ABN , Publish Date - Jun 30 , 2025 | 05:36 PM

CBSE National Teacher Award: CBSE జాతీయ ఉపాధ్యాయ అవార్డు 2025 కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు జూలై 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ జాబితా, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు.

CBSE: జాతీయ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ఎవరెవరు అర్హులంటే..
CBSE National Teacher Award 2025

CBSE National Teacher Award 2025:సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) జాతీయ ఉపాధ్యాయ అవార్డు 2025 కోసం నామినేషన్ ప్రక్రియను ప్రారంభించింది. CBSE గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు లేదా ప్రిన్సిపల్‌లు ఈ అవార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యారంగంలో అసాధారణ కృషి చేసిన ఉపాధ్యాయులను సత్కరించడమే నేషనల్ టీచర్ అవార్డు ప్రధాన లక్ష్యం. భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులు CBSE అధికారిక పోర్టల్ cbseit.in/cbse/2025/tchawrd/index.aspxలో ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. చివరి తేదీ జూలై 6, 2025.


అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ కింది సమాచారాన్ని అర్హులైన సిబ్బందికి తెలియజేసి సకాలంలో దరఖాస్తు చేసుకునేలా చూసుకోవాలని CBSE కోరింది. కాగా, గత సంవత్సరం దేశవ్యాప్తంగా మొత్తం 82 మంది ఉపాధ్యాయులు జాతీయ ఉపాధ్యాయ అవార్డును గెలుచుకున్నారు. బహుమతిగా ఉపాధ్యాయులకు మెరిట్ సర్టిఫికేట్, రూ. 50,000 నగదు బహుమతితో పాటు వెండి పతకాన్ని అందిస్తారు. అంతేగాక, అవార్డు గ్రహీతలకు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడే అవకాశం కూడా లభిస్తుంది.


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

  • మార్చి 31, 2025 నాటికి CBSE గుర్తింపు పొందిన బోర్డుకు అనుబంధంగా ఉన్న పాఠశాలలో కనీసం 10 సంవత్సరాల నిరంతర సేవల అందించిన ఉపాధ్యాయులు అర్హులు.

  • రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు, స్థానిక సంస్థల పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలతో పాటు కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాలు వంటి కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, పాఠశాలల అధిపతులు ఈ అవార్డుకు అప్లై చేసుకోవచ్చు.

  • ఇక ప్రిన్సిపల్10 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా, 5 సంవత్సరాలు ప్రిన్సిపల్‌గా పనిచేసి ఉండాలి.

  • 2025 మార్చి 31న లేదా ఆ తర్వాత పదవీ విరమణ చేస్తున్న ఉపాధ్యాయులు/ప్రిన్సిపల్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

  • అయితే, ప్రిన్సిపల్స్ టీచర్ కేటగిరీలో దరఖాస్తు చేసుకోలేరు. ఒక వ్యక్తి ఒక కేటగిరీలో మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు.


అవసరమైన పత్రాలు

  • ఈ కింది పత్రాలను దరఖాస్తుతో పాటు అప్‌లోడ్ చేయాలి (PDF, 1MB కంటే తక్కువ):

  • ధృవీకరణ ప్రకటన ఫారం.

  • సిఫార్సు లేఖ, సేవా ధృవీకరణ పత్రం (పాఠశాల మేనేజర్ సంతకం చేసినది)

  • విద్యా పత్రాలు (10వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు)

  • బోర్డు లేదా పాఠశాల స్థాయి పరీక్ష ఫలితాలు.

  • పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా మేనేజర్ మీ పత్రాలను ధృవీకరించడం తప్పనిసరి.


ఎంపిక ప్రక్రియ

  • దరఖాస్తులను సర్వీసు కాలం, అర్హత, వయస్సు, పరీక్ష ఫలితాల ఆధారంగా సమీక్షిస్తారు.

  • టాప్ 24 మంది అభ్యర్థుల మెరిట్ జాబితా తయారు చేస్తారు.

  • టై అయితే అదనపు ప్రమాణాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

  • ఎంపికైన అభ్యర్థులు తమ పత్రాలను 2 రోజుల్లోపు అప్‌లోడ్ చేయాలి.

  • ఇంటర్వ్యూ తర్వాత జాతీయ స్థాయి స్క్రీనింగ్ కమిటీ తుది ఎంపికను నిర్వహిస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మీరు ITI పాసయ్యారా? గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తుంటే ఇదే మంచి ఛాన్స్..!
డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఫ్రీ ఇంటర్న్‌షిప్.. జీతం గంటకు రూ.3,419..

For Educational News And Telugu News

Updated Date - Jun 30 , 2025 | 06:00 PM