Central Bank Recruitment 2025: సెంట్రల్ బ్యాంకులో 4500 పోస్టులు.. ఈ రోజే లాస్ట్ డేట్.. వెంటనే అప్లై చేయండి..
ABN , Publish Date - Jun 23 , 2025 | 09:52 AM
CBI Apprentice Recruitment 2025: డిగ్రీ పూర్తయిన యువతకు సువర్ణావకాశం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నియామకాలు చేపడుతోంది. ఈ రోజే చివరి అవకాశం. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.

CBI Apprentice Recruitment 2025 Apply Online: మీరు గ్రాడ్యుయేట్ అయి బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌ను ప్రారంభించాలనుకుంటే మీకో గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని పలురాష్ట్రాల్లోని 4500 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. గ్రాడ్యుయేట్ అయిన ప్రతి ఒక్కరూ ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు అర్హులే. చివరి తేదీ జూన్ 23. అంటే ఈ రోజే ఆఖరి అవకాశం. ఆసక్తిగల అభ్యర్థులు centralbankofindia.co.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుకు చివరి తేదీ: 23 జూన్ 2025
ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 25 జూన్ 2025
తాత్కాలిక పరీక్ష తేదీ: జూలై 2025 మొదటి వారం
ఖాళీ వివరాలు & అర్హతలు:సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఈ నియామకంలో మొత్తం 4500 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థి కనీస వయస్సు 20 సంవత్సరాలు. గరిష్ఠ వయస్సు 28 సంవత్సరాలు. SC, ST, OBC, దివ్యాంగ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ పోస్టుల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో పూర్తవుతుంది. మొదట100 మార్కులకు అభ్యర్థులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. నెగటివ్ మార్కులు ఉండవు.
తరువాత స్థానిక భాషా పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో అభ్యర్థి తాను దరఖాస్తు చేసుకున్న రాష్ట్ర భాషను చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
చివరగా, విజయవంతమైన అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అన్ని దశల్లో విజయం సాధించిన అభ్యర్థులను మెరిట్ జాబితా ఆధారంగా నియమిస్తారు.
శిక్షణ వ్యవధి, స్టైఫండ్
అభ్యర్థుల శిక్షణ కాలం 12 నెలలు లేదా 1 సంవత్సరం ఉంటుంది. అభ్యర్థులకు నెలకు రూ. 15,000 స్టైఫండ్ ఇస్తారు.
దరఖాస్తు రుసుము
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు కేటగిరీ ప్రకారం దరఖాస్తు రుసుము చెల్లించాలి. PwBD కేటగిరీ అభ్యర్థులకు రుసుము రూ. 400 + GST. SC / ST / మహిళా అభ్యర్థులు, EWS కేటగిరీకి, రుసుము రూ. 600 + GST. ఇతర అన్ని వర్గాలకు, రుసుము రూ. 800 + GSTగా నిర్ణయించారు.
ఆన్‌లైన్ మోడ్ (నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, UPI మొదలైనవి) ద్వారా మాత్రమే రుసుము చెల్లించాలని అభ్యర్థులు గమనించాలి. ఫీజు చెల్లింపుకు చివరి తేదీ జూన్ 25, 2025.
ఎలా దరఖాస్తు చేయాలి?
ముందుగా centralbankofindia.co.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
ఇప్పుడు హోమ్‌పేజీలో 'అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025' లింక్‌పై క్లిక్ చేయండి.
కొత్తగా నమోదు చేసుకుని లాగిన్ అవ్వండి.
దరఖాస్తు ఫారమ్ నింపి సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయండి.
దరఖాస్తు రుసుము చెల్లించండి.
ఫారమ్‌ను సబ్మిట్ చేసి దాని ప్రింట్ కాపీని సురక్షితంగా ఉంచుకోండి.
ఈ వార్తలు కూడా చదవండి..
పుణె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో అడ్మిషన్స్
యువతకు మైక్రోసాఫ్ట్ సూపర్ ఛాన్స్.. ఏఐ నుంచి డేటా సైన్స్
For Educational News And Telugu News