Bank Of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 పోస్టులు.. టెన్త్ పాసైతే చాలు..
ABN , Publish Date - May 19 , 2025 | 09:09 AM
Bank Of Baroda Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ బరోడా 500 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికషన్ విడుదల చేసింది. పదవ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి, ఆసక్తి ఉన్నవారు మే 23, 2025 లోగా అప్లై చేసుకోండి.

Bank Of Baroda Office Assistant Recruitment 2025: 10వ తరగతి పాసైన నిరుద్యోగులకు శుభవార్తు. బ్యాంకులో ఉద్యోగం సాధించేందుకు ఇదే మంచి ఛాన్స్. బ్యాంకు ఆఫ్ బరోడా ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి తాజాగా భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు www.bankofbaroda.in ని సందర్శించడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ మే 23, 2025.
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 500 ఆఫీస్ అసిస్టెంట్ (ప్యూన్) ఖాళీలను భర్తీ చేయాలని బ్యాంక్ ఆఫ్ బరోడా లక్ష్యంగా పెట్టుకుంది. దరఖాస్తుకు చివరి తేదీ మే 23, 2025. దిద్దుబాటు, రుసుము చెల్లింపుకు చివరి తేదీ కూడా మే 23. అయితే, దరఖాస్తు ప్రింటవుట్‌ను జూన్ 7, 2025 వరకూ తీసుకోవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాళీల వివరాలు
జనరల్ కేటగిరీ- 252 పోస్టులు
OBC – 108 పోస్టులు
EWS – 42 పోస్టులు
SC – 65 పోస్టులు
ST – 33 పోస్టులు
విద్యార్హతలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన పాఠశాల నుండి 10వ తరగతి (SSC/మెట్రిక్యులేషన్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంకా వారు సంబంధిత రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో నివసిస్తుంటే స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. అంటే, అభ్యర్థులకు ఆ భాషను చదవడం, రాయడం, మాట్లాడటం తప్పక వచ్చి ఉండాలి.
వయోపరిమితి
18-26 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము
జనరల్, EWS, OBC కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 600 కాగా, SC, ST, PWB, Ex-PWD, DPSXS, మహిళలకు దరఖాస్తు రుసుము రూ. 100. రుసుమును ఆన్లైన్లో చెల్లించాలి.
ఎలా దరఖాస్తు చేయాలి?
ముందుగా బ్యాంక్ ఆఫ్ బరోడా కెరీర్ పేజీ www.bankofbaroda.in/Careers.htm కి వెళ్ళండి.
తర్వాత 'Current opportunities' కి వెళ్లి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.
ఆ తర్వాత 'Apply Now' లింక్‌పై క్లిక్ చేయండి.
అప్లికేషన్ ఫాం ఫిల్ చేశాక అవసరమైన సర్టిఫికేట్లను అప్లోడ్ చేయండి. తర్వాత ఫీజు చెల్లించండి.
చివరగా దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసి ప్రింటవుట్ తీసుకోండి.
ఎంపిక ప్రక్రియ
ఈ పోస్టుల ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, స్థానిక భాషా పరీక్ష ఉంటాయి. పరీక్ష వ్యవధి 80 నిమిషాలు. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. అవి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నాలెడ్జ్ టెస్ట్, జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ అరిథమెటిక్, సైకోమెట్రిక్ టెస్ట్ (రీజనింగ్). ప్రతి విభాగంలో 25 మార్కులు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు. పరీక్షలో నెగటివ్ మార్కులు కూడా ఉంటాయి. తప్పు సమాధానాలకు పావు వంతు మార్కులు కట్ చేస్తారు. 80 నిమిషాల్లో పరీక్ష పూర్తి చేయాల్సి ఉంటుంది.
Read Also: చదువుకు వయసు అడ్డం కాదుగా.. ఏడు పదుల వయసులో..
Indian Army: ఇండియన్ ఆర్మీలో యువతకు జాబ్ ఆఫర్స్.. నెలకు రూ.2 లక్షల జీతం..
UPSC 2026 Calendar: ఉద్యోగాల క్యాలెండర్ రిలీజ్.. ఏ ఎగ్జామ్ ఎప్పుడుందో తెలుసా..