Simhachalam: చందనోత్సవానికి సర్వం సిద్ధం ...
ABN , Publish Date - Apr 29 , 2025 | 02:40 PM
వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం (చందనోత్సవం) కోసం రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తిచేసినట్టు దేవస్థానం ఈవో కొమ్ముల సుబ్బారావు తెలిపారు.

82 లక్షల మంది భక్తులకు తగ్గ ఏర్పాట్లు
రేపు ఉదయం 4 గంటల నుంచి దర్శనాలు
సింహగిరిపైకి భక్తుల సొంత వాహనాలకు అనుమతి లేదు దేవస్థానం ఈఓ కొమ్ముల సుబ్బారావు
సింహాచలం, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం (చందనోత్సవం) కోసం రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తిచేసినట్టు దేవస్థానం ఈవో కొమ్ముల సుబ్బారావు తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, ఈ ఏడాది రూ.1500, రూ.1000, రూ.300 టికెట్లు విక్రయిస్తున్నామని, ప్రవేశ ద్వారం వద్ద, లోపల పంచింగ్, స్కానింగ్ చేయడం ద్వారా రీసేల్‌ను నిరోధించనున్నట్టు చెప్పారు. ఉచిత దర్శనాలు తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రారంభమవుతాయన్నారు. సింహగిరిపై పార్కింగ్ స్థలం చాలా తక్కువగా ఉన్నందున, కొండదిగువనే అధిక ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటుచేశామన్నారు. భక్తులందరూ తప్పనిసరిగా సొంత వాహనాలను కొండ దిగువనే వదిలి దేవస్థానం ఏర్పాటు చేసిన ఉచిత రవాణా సదుపాయాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఉచిత ప్రయాణానికి 45 ఆర్టీసీ బస్సులు, 40 మినీ బస్సులు, 15 ఇన్నోవాలను దేవస్థానం అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఉచితం, రూ.300, రూ.1000 క్యూలలోని భక్తులను తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తామన్నారు.
టికెట్లు...ఇక్కట్లు
విశాఖపట్నం, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): సింహాచలేశుని నిజరూప ఉచిత దర్శనానికి కనీసం నాలుగు గంటలు పట్టే అవకాశం, కనీసం పది కిలోమీటర్లు క్యూలో నడవాల్సి ఉండడంతో అత్యధికులు ఏదో ఒక టికెట్ కొని దర్శించుకోవాలని భావిస్తున్నారు. అయితే కేవలం రూ.300 టికెట్ తప్పితే ఇంకేమీ లేవని సింహాచలంలోని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అవి కూడా బుధవారం మధ్యాహ్న దర్శనానికి మాత్రమే ఉన్నాయని సోమవారం వెల్లడించారు. దర్శనాల కోసం దేవస్థానం అధికారులు రూ.1,500, రూ.1,000, రూ.300 విలువైన టికెట్లు ముద్రించి విక్రయాలకు సిద్ధం చేశారు. ఇందులో రూ.1,500 విలువైన టికెట్లు వీవీఐపీలకు, ప్రొటోకాల్ దర్శనాలకు ఇస్తామని వెల్లడించారు. అవి సుమారు 2,500 టికెట్లు ముద్రించామని చెప్పారు. సోమవారం రాత్రి వరకు వీటిని ఎవరికీ జారీ చేయలేదు. ఒకరోజు ముందుగా ప్రజా ప్రతినిధులకు, వీవీఐపీలకు, ప్రొటోకాల్ వ్యక్తులకు ఇవ్వనున్నారు. ఇవే టికెట్లను ఆశిస్తూ నగరంలో ప్రముఖులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్నారు. వారికి కూడా సోమవారం వరకూ ఎటువంటి సమాచారం రాలేదు. వేయి రూపాయల టికెట్‌తో గంట నుంచి రెండు గంటల వ్యవధిలో దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ టికెట్లు అయిపోయాయని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Case Filed: గ్రూప్ -1లో పీఎస్సార్ చేసిన అక్రమాలపై కేసు
Gorantla Madhav Bail: గోరంట్ల మాధవ్‌కు బెయిల్
Borugadda Remand Extension: బోరుగడ్డ రిమాండ్ పొడిగింపు
High Court: ఏబీవీ క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వు
For More AP News and Telugu News