Shivratri Prasadam: శివరాత్రి నాడు మహాదేవుడికి ఏమేం సమర్పించాలి.. ఆ 3 కంపల్సరీ
ABN , Publish Date - Feb 25 , 2025 | 08:22 PM
Mahashivratri 2025: మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా జరుపుకునేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఆ మహాదేవుడ్ని ప్రసన్నం చేసుకునేందకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో శివయ్యకు సమర్పించాల్సిన నైవేద్యాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

మహా శివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధమైంది. దేశంలోని శివాలయాలన్నీ ముస్తాబయ్యాయి. హర హర మహాదేవ్ నామస్మరణతో రేపు గుళ్లన్నీ మార్మోగనున్నాయి. భక్తుల తాకిడితో ఆలయాల్లో పండుగ శోభ నెలకొననుంది. ఉపవాసాలు, జాగరణలతో శివుడ్ని ప్రసన్నం చేసుకునేందకు భక్తులు సిద్ధమవుతున్నారు. శివరాత్రి నియమాలు, పూజా విధానం తెలుసుకొని అందుకు తగ్గట్లు అంతా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే వాళ్లు తెలుసుకోవాల్సిన మరో విషయం కూడా ఉంది. అదే నైవేద్యం. శివయ్యకు సమర్పించాల్సిన ప్రసాదాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
పాయసం
శివరాత్రి నాడు మహాదేవుడికి ఖీర్ (పాయసం)ను ప్రసాదంగా పెట్టొచ్చు. అంజీర్, బాదం, పిస్తా లాంటి డ్రై ఫ్రూట్స్, నట్స్‌ను సన్నగా తరిగి.. నెయ్యిలో వేయించాలి. ఆ తర్వాత వీటిని పాలల్లో వేసి కాస్త ఉడికించాలి. దీన్ని భక్తశ్రద్ధలతో మహాదేవుడికి సమర్పించాలి.
శ్రీఖండ్
శివుడికి ఇష్టమైన ప్రసాదంగా దీనిని చెబుతారు. శ్రీఖండ్ తయారీ విధానానికి వస్తే.. ఒక క్లాత్‌లో రెండు కప్పుల పెరుగు వేయాలి. దీన్ని గట్టిగా ముడి వేసి, అందులోని నీరు పోయేలా వేలాడదీయాలి. పెరుగు పూర్తిగా డ్రై అయ్యాక అందులో కుంకుమ పువ్వు, పాలు కలిపిన మిశ్రమాన్ని వేయాలి. ఇందులో చక్కెర, యాలకుల పొడి మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. దీన్ని డ్రైఫ్రూట్స్‌తో చక్కగా గార్నిష్ చేసి ప్రసాదంగా సమర్పించాలి.
పంచామృతం
శివుడికి ఇష్టమైన ప్రసాదాల్లో పంచామృతం కూడా ఒకటని అంటుంటారు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నీళ్లను ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. వీటన్నింటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలిపి స్వామి వారికి సమర్పించాలి. శివుడి నైవేద్యానికి సంబంధించి పక్వం, అపక్వం అనే రెండు పదార్థాలు ఉంటాయి. అపక్వాల్లో ఎండు ద్రాక్ష, అరటిపండ్లు, ఖర్జూరాలు ప్రసాదంగా సమర్పించాలని చెబుతారు. అదే పక్వానికి సంబంధించి పాయసం మహాదేవుడికి ఇష్టమైనదని అంటుంటారు.
ఇవీ చదవండి:
శివయ్య అనుగ్రహం.. ఈ 4 రాశులకు ఢోకా లేదు
శివానుగ్రహం.. ఈ ఏడాది వీళ్లకు తిరుగులేదు
ఈ వారం వాహనాలు నడపడంలో జాగ్రత్త..
మరిన్ని ఆధ్యాత్మిక, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి