Mahashivratri 2025 Horoscope: మహా శివరాత్రి స్పెషల్.. ఈ 4 రాశుల వారికి ఢోకా లేదు
ABN , Publish Date - Feb 25 , 2025 | 05:41 PM
Mahashivratri 2025 Zodiac Signs: మహా శివరాత్రి పర్వదినం వచ్చేసింది. ఫిబ్రవరి 26వ తేదీన ఈ పండుగను ఘనంగా జరిపేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ శివరాత్రి ఏయే రాశుల వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో ఇప్పుడు చూద్దాం..

మహా శివరాత్రి పర్వదినం వచ్చేస్తోంది. ఫిబ్రవరి 26న ఈ పండుగను వైభవంగా జరుపుకునేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఉపవాసాలు, జాగారాలతో శివుడ్ని కొలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. శివపార్వతుల అనుగ్రహంతో అనుకున్న పనులు, శుభకార్యాలు విజయవంతంగా పూర్తవుతాయనేది నమ్మకం. అందుకే ఆది దంపతుల కృప కోసం కఠిన నియమాలతో ఉపవాసాలకు రెడీ అవుతున్నారు. ఈ రోజు చేసే పూజలు, వ్రతాలు శక్తితో పాటు ప్రశాంతతను కూడా ప్రసాదిస్తాయి. అలాగే కొన్ని రాశుల వారికి శివరాత్రి శుభప్రదంగా ఉంటుందని, శివానుగ్రహంతో వాళ్లకు ఢోకా ఉండదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
వీరిపై ఎఫెక్ట్
ఈ సంవత్సరం మహా శివరాత్రి సందర్భంగా 60 ఏళ్ల అనంతరం త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. సూర్యుడు, శని, బుధుడు ఈ రోజు కుంభ రాశిలో ఉంటారు. త్రిగ్రాహి యోగం 12 రాశుల మీద ప్రభావం చూపిస్తుంది. మకర రాశితో పాటు పలు ఇతర రాశుల పైనా ప్రభావం చూపిస్తుంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
మకర రాశి
త్రిగ్రాహి యోగం వల్ల మకర రాశి వాళ్ల జీవితాల్లో చాలా మార్పులు వస్తాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించడం, డబ్బులు చేతికి రావడం, కుటుంబం సంతోషంగా ఉండటం, ఆరోగ్యం మెరుగుపడటం లాంటి సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయని చెబుతున్నారు.
మేష రాశి
ఈ రాశి వారికి మహా శివరాత్రి నూతన శక్తిని, ఉత్సాహాన్ని తీసుకొస్తుందట. టార్గెట్లను సాధించడానికి ఇదే కరెక్ట్ టైమ్ అని.. శివుడి కృపతో అన్ని అడ్డంకుల్ని దాటి విజయాన్ని సాధిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
వృషభ రాశి
త్రిగ్రాహి యోగం వల్ల ఈ రాశుల వారి దాంపత్య జీవితం చాలా మెరుగుపడుతుందట. ఆదాయం పెరగడమే గాక సోదరుల పిల్లలకు డబ్బు సాయం కూడా చేస్తారట. ఆదాయ మార్గాలు పెరుగుతాయట.
కర్కాటక రాశి
ఈ రాశుల వారు శివరాత్రి నాడు భావోద్వేగాలను సమతుల్యం చేయడంతో పాటు ఆంతరంగికంగానూ శాంతిని పొందుతారని జ్యోతిష్య నిపుణలు అంటున్నారు. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారట.
ఇవీ చదవండి:
శివానుగ్రహం.. ఈ ఏడాది వీళ్లకు తిరుగులేదు
ఈ వారం వాహనాలు నడపడంలో జాగ్రత్త..
మరిన్ని ఆధ్యాత్మిక, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి