Hyderabad: 17 ఏళ్లుగా అయ్యప్ప స్వాములకు భిక్ష..
ABN , Publish Date - Oct 24 , 2025 | 10:56 AM
నిజాంపేట కార్పొరేషన్ బాచుపల్లిలో మాజీ సర్పంచ్ ఆగం పాండు (అయ్యప్ప స్వామి) ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాలుగా ప్రతీ సంవత్సరం అయ్యప్ప స్వాములకు అన్నదానం (భిక్ష) చేస్తున్నారు. ఇదే క్రమం ఈ ఏడాది కూడా గురువారం నుంచి అన్నదానం ప్రారంభించారు.
- ఏర్పాటు చేస్తున్న బాచుపల్లి మాజీ సర్పంచ్
హైదరాబాద్: నిజాంపేట కార్పొరేషన్ బాచుపల్లిలో మాజీ సర్పంచ్ ఆగం పాండు (అయ్యప్ప స్వామి) ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాలుగా ప్రతీ సంవత్సరం అయ్యప్ప స్వాములకు అన్నదానం (భిక్ష) చేస్తున్నారు. ఇదే క్రమం ఈ ఏడాది కూడా గురువారం నుంచి అన్నదానం ప్రారంభించారు. 2008 సంవత్సరంలో అయ్యప్ప మాల ధరించిన ఆగం పాండు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతీ సంవత్సరం అయ్యప్ప స్వాములకు 42 రోజుల పాటు తన సొంత ఖర్చులతో గ్రామ శివారులోని శివాలయం వద్ద భిక్ష ఏర్పాటు చేస్తున్నారు. భోజన ఏర్పాట్ల కోసం గుడి పక్కనే ఒక షెడ్డును నిర్మించారు. మరోపక్క తన తల్లిదండ్రుల పేరు మీద గదుల నిర్మాణం కూడా చేసట్టారు.

ప్రతి రోజూ మధ్యాహ్నం భోజన సమయానికి బాచుపల్లి, నిజాంపేట(Bachupalli, Nizampet), ప్రగతినగర్, మల్లంపేట, బౌరంపేట తదితర ప్రాంతాల నుంచి అయ్యప్ప మాలధారులు వచ్చి భిక్షను స్వీకరిస్తారు. ఇలా ఉండగా, ఆగం పాండు స్వామి ప్రతి సంవత్సరం దాదాపు 50 నుంచి 100 అయ్యప్ప భక్తులను తన సొంత ఖర్చులతో అయ్యప్ప దర్శనానికి శబరిమల తీసుకెళ్తుండటం గమనార్హం.

ఈ వార్తలు కూడా చదవండి..
మద్యం దరఖాస్తులతో 2,863 కోట్ల ఆదాయం
విమానాల్లో పవర్ బ్యాంకులపై నిషేధం
Read Latest Telangana News and National News