Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు బంగారానికి బదులు ఈ వస్తువులను కొన్నా శుభప్రదమే..
ABN , Publish Date - Apr 19 , 2025 | 03:50 PM
Akshaya Tritiya 2025 Alternatives to Gold: అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందనే అభిప్రాయం అనేకమందిలో ఉంది. ప్రస్తుతం బంగారం ధరకు రెక్కలొచ్చి కొండెక్కి కూర్చోడంతో సామాన్య ప్రజలు ఎవరూ ఆ సాహసం చేయరు. కానీ, ఆ రోజున బంగారానికి బదులుగా ఈ వస్తువులను కొనుగోలు చేసినా అంతే ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.

Akshaya Tritiya 2025 Alternatives to Gold: ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ పండగ రాబోతుంది. వైశాఖ మాసం శుక్ల పక్షంలో మూడవ రోజున ఈ పండగ వస్తుంది. ఈనాడు విష్ణువు, లక్ష్మీదేవిని ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. వేదశాస్త్రాల ప్రకారం పురాణ కాలం నుంచి అక్షయ తృతీయ దానధర్మాలు, లక్ష్మీ పూజతో పాటు శుభ కార్యాలకు మంచిదని భావిస్తారు. ఈ పర్వదినాన బంగారం కొంటే ఆనందం, శ్రేయస్సు, సంపద ఆ ఇంట్లో వెల్లివిరిస్తాయనే నమ్మకం ఉంది. కానీ బంగారం ధర రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతుండటంతో.. సామాన్యులకు పసిడి అందని ద్రాక్షే అయింది. కలలో కూడా బంగారం కొనే సాహసం చేయలేకపోతున్న మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగించే సూత్రాలు ప్రతిపాదిస్తున్నారు పండితులు. అక్షయ తృతీయ రోజున బంగారానికి బదులుగా ఈ వస్తువులు కొన్నా లక్ష్మీదేవి ఆశీర్వాదం దక్కుతుందని సూచిస్తున్నారు. మరి, అవేంటో తెలుసుకోండి.
అక్షయ తృతీయ నాడు బంగారం కొనడాన్ని శుభసూచకంగా భావిస్తారు. ఈ రోజున ఆవగింజంత పుత్తడి కొన్నా లక్ష్మీదేవీ ఆశీర్వాద ఫలం దక్కి కలకాలం ఇంట్లో సంపద, ఆనందం, శ్రేయస్సు ఉంటుందని నమ్ముతారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో బంగారానికి బదులు ఈ వస్తువులు కొన్నా అదే ఫలితం దక్కుతుంది.
పత్తి
మీ దగ్గర పెద్దగా డబ్బు లేకపోయినా అక్షయ తృతీయ శుభ సందర్భంగా ఏదైనా కొనాలనుకుంటే పత్తి కొనండి. పత్తి ఇంటికి ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. కాబట్టి అక్షయ తృతీయ నాడు పత్తి కొనుగోలు చేయవచ్చు.
రాతి ఉప్పు
అక్షయ తృతీయ నాడు బంగారం కొనడానికి మీ దగ్గర బడ్జెట్ లేకపోతే రాతి ఉప్పు కొనండి. ఇది మీ ఇంట్లోని ప్రతికూలతలను పోగొట్టి సంతోషాన్ని తీసుకురావడంలో సహాయపడుతుంది. కానీ ఈ ప్రత్యేకమైన రోజున రాతి ఉప్పుని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని గుర్తుంచుకోండి.
మట్టి పాత్రలు
మీరు బంగారం కొనలేకపోతే అక్షయ తృతీయ రోజున మట్టి కుండలు కొని ఇంటికి తీసుకురండి. మట్టి కుండ, కుండ లేదా మట్టి దీపాలు వంటివి. ఎందుకంటే అక్షయ తృతీయ నాడు మట్టి కుండ కొనడం శుభప్రదంగా భావిస్తారు. ఇది డబ్బు, సంపదను సూచిస్తుంది. దీన్ని కొనుగోలు చేసేవారికి ఆర్థిక శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు.
బార్లీ లేదా పసుపు ఆవాలు
బార్లీని ఆనందం, ఆర్థిక శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున బార్లీ లేదా పసుపు ఆవాలు కొని ఇంటికి తెచ్చుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి.
చెట్లను నాటడం
అక్షయ తృతీయ నాడు చెట్లను నాటడం లేదా పర్యావరణ సంరక్షణ కోసం పెట్టుబడులు కూడా చాలా శుభప్రదంమని పండితులు చెబుతున్నారు. పరిసరాల్లో పచ్చదనం పెరిగేలా ప్రోత్సహించి ఇతర జీవులకు నిలువ నీడ కలిగించే ఈ పని వల్ల దేవతలు ఆశీస్సులు లభిస్తాయి. భావితరాలకు ఈ సంప్రదాయం ఊపిరి పోస్తుందని అంటున్నారు.
వెండి
అక్షయ తృతీయ రోజున బంగారం కొనడానికి మీ దగ్గర డబ్బు లేకపోతే మీరు వెండి, రాగి లేదా ఇత్తడిని కూడా కొనుగోలు చేయవచ్చు. ఆ రోజున ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకున్నా బంగారం తెచ్చుకున్నంత ఫలితమే దక్కుతుంది.
Read Also: Today Horoscope: ఈ రాశి వారికి మహాదశ మారిన వెంటనే విజయాలు'
Today Horoscope: ఈ రాశి వారికి అపూర్వ యోగం బ్రహ్మాండమైన మార్పు
Today Horoscope: ఈ రాశి వారి దశ మారబోతోంది