Share News

Hyderabad: ఎన్నో ఆశలతో హైదరాబాద్ వచ్చి.. చివరకు..

ABN , Publish Date - May 08 , 2025 | 08:31 AM

ఎన్నో ఆశలతో హైదరాబాద్ వచ్చి.. చివరకు రోడ్డు ప్రమాదం అతడిని చిదిమేసింది. ఎక్కడో ఓ మారుమూల పల్లె నుంచి వచ్చి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉద్యోగం చూస్తూ అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం అతడిని అందనంత దూరాలకు తీసుకెల్లింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: ఎన్నో ఆశలతో హైదరాబాద్ వచ్చి.. చివరకు..

- రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి

హైటెక్‌ సిటీ: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతిచెందాడు. ఈ సంఘటన మాదాపూర్‌ పోలీస్‏స్టేషన్‌(Madhapur Police Station) పరిధిలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా పరకాల మండలం పులిగిల్‌ గ్రామానికి చెందిన ముత్యంరావు కుమారుడు మోకిడి దీపక్‌(29) ఓఆర్‌ఆర్‌ సమీపంలోని మల్లంపేటలో ఉంటూ ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో విధులు నిర్వహిస్తున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Special Trains: నల్గొండ, విజయవాడ, ఏలూరు మీదుగా బెర్హంపూర్‌ మార్గంలో 16 ప్రత్యేక రైళ్లు


మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మల్లంపేటలోని ఇంటి నుంచి బయటకు వచ్చిన దీపక్‌ అల్విన్‌ కాలనీ, తులసినగర్‌లోని సోదరుడు మణికంఠ ఇంటికి వెళ్లాడు. రాత్రి 11 గంటల వరకు అక్కడే ఉన్నాడు. అనంతరం అక్కడ నుంచి వచ్చేసిన ఆయన అర్ధరాత్రి 2.10 గంటల సమయంలో బోరబండ(Borabanda) సమీపంలోని పర్వత్‌ నగర్‌ నుంచి హైటెక్‌ సిటీ వైపు వెళ్లేందుకు హీరో గ్లామర్‌(టీఎస్‌ 03 ఈఈ 2377)పై వెళ్తున్నాడు.


city3.2.jpg

అదే సమయంలో బిర్యానీ టైమ్స్‌ హోటల్‌ వద్ద వాటర్‌ ట్యాంకర్‌(టీఎస్‌ 12 యూఏ 9090) డ్రైవర్‌ అకస్మాతుగా యూటర్న్‌ తీసుకున్నాడు. దీపక్‌ వాహనం అదుపు తప్పడంతో లారీ చక్రాల కింద పడిపోయాడు. తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. దీపక్‌ బావ కిషన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ బలరాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. లైవ్‌లో పాక్ యాంకర్ కన్నీరు..

Operation Sindoor: 300 విమానాల రద్దు 25 విమానాశ్రయాల మూసివేత

Operation Sindoor: సిందూరమే.. సంహారమై

CM Revanth Reddy: అత్యవసర సర్వీసుల సిబ్బంది సెలవులు రద్దు

బలోచ్ లిబరేషన్ ఆర్మీ దాడి..

Read Latest Telangana News and National News

Updated Date - May 08 , 2025 | 08:31 AM