AP News: తలపై కొట్టి.. యువకుడి దారుణహత్య
ABN , Publish Date - Nov 08 , 2025 | 08:05 AM
మండలంలోని గొళ్లపల్లి పంచాయతీ పరిధిలోని గుడిసివారిపల్లి వద్ద ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన శుక్రవారం కలకలం రేపింది. అవివాహితుడైన యువకుడిని విచక్షణారహితంగా తలపై కొట్టి చంపి పడేసినట్లు తెలియడంతో గొళ్లపల్లి చుట్టుపక్కల జనం ఉలిక్కిపడ్డారు.
- పోలీసు జాగిలాలు.. క్లూస్‌టీంతో ఆధారాల సేకరణ
బి.కొత్తకోట(అన్నమయ్య): మండలంలోని గొళ్లపల్లి పంచాయతీ పరిధిలోని గుడిసివారిపల్లి వద్ద ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన శుక్రవారం కలకలం రేపింది. అవివాహితుడైన యువకుడిని విచక్షణారహితంగా తలపై కొట్టి చంపి పడేసినట్లు తెలియడంతో గొళ్లపల్లి చుట్టుపక్కల జనం ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న బి.కొత్తకోట సీఐ గోపా ల్‌రెడ్డి తన సిబ్బందితో సంఘటనా స్థలా నికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హత్యకు గురైన వ్యక్తి జయప్రకాష్‌రెడ్డి(21)గా గుర్తించారు. కేసు విచారణ లో భాగంగా జాగిలాలను, క్లూస్ టీంను రప్పించి ఆధా రాల సేకరణకు శ్రీకారం చుట్టారు. ఈ హత్యకు సంబం ధించి సీఐ కథనం మేరకు...

గొళ్లపల్లి(Gollapalli) పంచాయతీ పరిధిలోని గుడిసివారి పల్లికి చెందిన జయప్రకాష్‌రెడ్డి తండ్రి వెంకటశివారెడ్డి కొన్నేళ్ల కిందట మృతిచెందాడు. తల్లి శ్యామల, తమ్ముడు గిరివర్ధన్‌రెడ్డి ఉన్నారు. తమ్ముడు గుంటూరులో సీఏ చదువుతుండగా, జయప్రకాష్‌రెడ్డి అంగళ్లు వద్దనున్న ఓ కళాశాలలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాగా మూడు నెలలుగా జయప్రకాష్‌రెడ్డి కళాశాలకు వెళ్లకుండా గుడిసివారిపల్లిలోని ఇంటివద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆస్తి విషయమై తల్లీకొడుకుల మధ్య విభే దాలు వచ్చాయి.
భాగం కోసం తరచూ తల్లి శ్యామలతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో అతనితో గొడవలు భ రించలేక తన పుట్టినిల్లు అయిన మదనపల్లి సమీపంలో ని జోకుపల్లికి వెళ్లి తల్లి వుంటోంది. ఈ నెల 3న జయ ప్రకాష్‌రెడ్డి జోకుపల్లికి కూడా వెళ్లి తల్లితో ఆస్తి విషయ మై మరోసారి గొడవపడగా, ఆక్కడి బంధు వులు సర్దిచెప్పి పంపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున గుడిసివారిపల్లి సమీపంలో శవమై కనిపించాడు. జయప్రకా ష్ పెద్దమ్మ సరళ ఘటనపై సమాచారం ఇవ్వడంతో తల్లి శ్యామల, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకు న్నారు.

జయప్రకాష్‌రెడ్డి తల, కాళ్లకు తీవ్రగాయాలై రక్తపు మడుగులో పడివున్నాడు. ఈ ఘటనపై గుర్తు తెలియని వ్యక్తులు తన అన్నను చంపివేశారంటూ మృ తుడి తమ్ముడు గిరివర్ధన్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొ న్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించిన అనం తరం పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ హత్యోదంతం మండలంలో చర్చనీయాంశమైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కిసాన్ డ్రోన్.. సాగు ఖర్చు డౌన్
Read Latest Telangana News and National News