Share News

Secundrabad: ఒడిశా టు ముంబై.. వయా సికింద్రాబాద్‌.. విషయం ఏంటంటే..

ABN , Publish Date - Nov 13 , 2025 | 09:59 AM

ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి సరుకు సరఫరా చేస్తున్న వదిన మరిదిలను సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వీరినుంచి 18.823 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే డీఎస్పీ జావీద్‌, సికింద్రాబాద్‌ రైల్వే ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

Secundrabad: ఒడిశా టు ముంబై.. వయా సికింద్రాబాద్‌.. విషయం ఏంటంటే..

- గంజాయి సరఫరా

- 18.823 కిలోల సరుకు పట్టివేత

- వదిన మరిదిల అరెస్టు

సికింద్రాబాద్‌: ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి సరుకు సరఫరా చేస్తున్న వదిన మరిదిలను సికింద్రాబాద్‌(Secundrabad) రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వీరినుంచి 18.823 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే డీఎస్పీ జావీద్‌, సికింద్రాబాద్‌ రైల్వే ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌లు తెలిపిన వివరాల ప్రకారం బిహార్‌ నాగర్‌నౌసా(Bihar Nagar Nausa) ప్రాంతానికి చెందిన అజయ్‌ కుమార్‌(35), రినాదేవి(40)లు సులువుగా డబ్బు సంపాదించేందుకు బీహర్‌ రాయగడకు చెందిన పంకజ్‌ను ఆశ్రయించారు.


ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి సరుకు సరఫరా చేస్తే ఒక్కొక్కరికి రానుపోను ఐదువేల రూపాయలు ఇస్తానని పంకజ్‌ చెప్పగా, వారు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఇద్దరు 18.823 కిలోల గంజాయి సరుకుతో రాయగడ(Rayagada) నుంచి ఒడిశాకు చేరుకున్నారు. ఒడిశా నుంచి ముంబాయికి వెళ్లేందుకు ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఎక్కారు. బుధవారం ఉదయం ఆ రైలు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాం నం.10 వద్ద చేరుకుంది.


city5.2.jpg

రోజులాగే ఆగిన ఆ రైలులో రైల్వే, ఆర్పీఎఫ్‌ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఏ1 కోచ్‌లోని బెర్తు నెంబరు 16, 18లో ఒక ట్రాలీ సూట్‌కే్‌సను తనిఖీ చేయగా 18.823 కిలోల గంజాయి పట్టుబడింది. ఇద్దరిని విచారించగా పంకజ్‌ అనే వ్యక్తి తమకు సరుకు ఇచ్చాడని విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం పంకజ్‌ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. వదిన మరిదిలను రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించి, సరుకును స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సిమెంట్‌ రంగంలో రూ 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు

సైబర్‌ దాడుల నుంచి రక్షణకు టాటా ఏఐజీ సైబర్‌ ఎడ్జ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Nov 13 , 2025 | 09:59 AM