Share News

Hyderabad: ఒకటి కాదు.. రెండుకాదు.. మొత్తం రూ52.29 లక్షలు.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Apr 22 , 2025 | 07:03 AM

ఒకటి కాదే.. రెండుకాదు.. మొత్తం రూ52.29 లక్షలు దోచేశారు. సైబర్ మోసాలపై సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నా.. ప్రజల్లో ఇంకా అంత అవగాహన లేకపోవడంతో ప్రజలు పెద్దఎత్తున నష్టపోతూనే ఉన్నారు. తాజాగా రూ52.29 లక్షలు దోచేసిన విషయం హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: ఒకటి కాదు.. రెండుకాదు.. మొత్తం  రూ52.29 లక్షలు.. ఏం జరిగిందంటే..

- ట్రేడింగ్‌ పేరుతో రూ52.29 లక్షలకు టోకరా..

- యూపీకి చెందిన వ్యక్తి అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నగరవాసిని నమ్మించి రూ52.29 లక్షలు కాజేశారు. ఈ కేసులో సైబర్‌ నేరగాళ్లకు ఖాతాలు సమకూర్చిన వ్యాపారిని అధికారులు అరెస్ట్‌ చేశారు. యూపీకి చెందిన ప్రతీక్‌ శుక్లా (23) వ్యాపారి. సైబర్‌ నేరగాళ్లతో పరిచయం పెంచుకున్న ఇతడు వారి మోసాలకు సహకరించడం ప్రారంభించాడు. తన బ్యాంకు ఖాతాతో పాటు పలువురు బ్యాంకు ఖాతాలను కమీషన్‌ ప్రాతిపదికన సైబర్‌ నేరగాళ్లకు ఇచ్చేవాడు.

ఈ వార్తను కూడా చదవండి: Kishan Reddy: మజ్లిస్‌ చేతిలో కీలు బొమ్మలు


city1.2.jpg

ఖాతాల్లో పడ్డ డబ్బులో కొంత మినహాయించుకొని, మిగతా డబ్బును నేరగాళ్లకు చేరవేసేవాడు. నగరానికి చెందిన వ్యక్తి (68)ని సంప్రదించిన సైబర్‌ నేరగాళ్లు స్టాక్‌ మార్కెట్‌(Stock market)లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. టెలిగ్రాం గ్రూపుల్లో చేర్చి పెట్టుబడి పెట్టేలా ఒత్తిడి చేశారు.


కొద్ది మొత్తంలో లాభాలు చూపుతూ పెట్టుబడి పేరుతో పలు దఫాలుగా రూ.52.29 లక్షలు వసూలు చేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్‌ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. సైబర్‌ క్రైం పోలీసులు సాంకేతిక ఆధారాల ద్వారా బాధితుడి డబ్బు ప్రతీక్‌ శుక్లా(Prateek Shukla) బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్లు గుర్తించారు. యూపీ వెళ్లిన నగర పోలీసులు ప్రతీక్‌ శుక్లాను అరెస్ట్‌ చేసి నగరానికి తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Gold Price Record: బంగారం లకారం

గూగుల్ కీలక నిర్ణయం..ఆ కేసు పరిష్కారం కోసం రూ.20.24 కోట్లు చెల్లింపు

కేటీఆర్‌పై కేసులు కొట్టివేసిన హైకోర్టు

ACB: ఏసీబీ వలలో ఐదుగురు అధికారులు

నీట ఆటగాడు..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 22 , 2025 | 07:09 AM