Share News

Hyderabad: ప్రేమించిన అమ్మాయి దక్కలేదని..

ABN , Publish Date - May 16 , 2025 | 09:37 AM

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని.. ప్రియురాలి భర్తను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన కూకట్‏పల్లి హౌసింగ్ బోర్డు(కేపీహెచ్‏బీ) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: ప్రేమించిన అమ్మాయి దక్కలేదని..

- ప్రియురాలి భర్తను హత్య చేసిన నిందితుడి అరెస్టు

హైదరాబాద్: ప్రేమించిన అమ్మాయి దక్కకపోగా, వివాహం చేసుకొని తన ముందే సంతోషంగా ఉండటం ఓర్చుకోలేక ఆమె భర్తను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు గురువారం పోలీస్‏స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్‌ డీసీపీ సురేష్‏కుమార్‌(Balanagar DCP Suresh Kumar) వివరాలు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం అడవిపూడికి చెందిన పంపన అయ్యప్ప స్వామి అలియాస్‌ పవన్‌కుమార్‌ (27) సుమారు 8ఏళ్ల క్రితం తమ ఊరికే చెందిన శ్రావణ సంధ్యను ప్రేమించాడని, ఆమెను వివాహం చేసుకోవాలని భావించగా యువతి తల్లి అందుకు నిరాకరించి వెంకటరమణకు ఇచ్చి వివాహం చేశారని తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఆడపిల్ల పుట్టిందని ఎంతపని చేశాడో తెలిస్తే..


ప్రేమించిన యువతి దక్కకపోవడంతో పవన్‌కుమార్‌ మద్యానికి బానిసయ్యాడన్నారు. ఈ క్రమంలో బతుకు దెరువు కోసం తమ గ్రామం నుండి ఆరునెలల క్రితం వెంకటరమణ తన భార్యతో కలిసి కేపీహెచ్‌బీ కాలనీ భగత్‌సింగ్‌నగర్‌కు వచ్చి జీవనం సాగిస్తున్నాడని తెలిపారు. పవన్‌ సైతం ఊరి నుండి వచ్చి వారికి సమీపంలోని సర్దార్‌పటేల్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడని, ఇటీవల వపన్‌కు శ్రావణ సంధ్య కనిపించడంతో ఆమె వెనుకాల పడగా, తన భార్యకు దూరంగా ఉండాలని వెంకటరమణ పలుమార్లు పవన్‌ను హెచ్చరించాడన్నారు.


తాను ప్రేమించిన అమ్మాయి తన కళ్లముందే భర్తతో సంతోషంగా ఉండటం, తనను కలిసేందుకు యత్నిస్తే భర్త అడ్డుపడుతుండటంతో పవన్‌ వెంకటరమణ అడ్డు తొలగించుకోవాలని భావించాడని తెలిపారు. ఈనెల 11న వెంకటరమణ తన తోడల్లుడు ఇంటిలో ఉండగా పక్కనే ఉన్న పార్క్‌లో పవన్‌ తన నలుగురు స్నేహితులతో కలిసి మద్యం తాగి అల్లరి చేయగా వెంకటరమణ వారిని వారించాడని తెలిపారు.


ఇదే అదునుగా భావించిన పవన్‌ తనవద్ద ఉన్న కత్తితో వెంకటరమణ ఛాతీపై దాడి చేయగా తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు సహకరించిన నలుగురిని రెండురోజుల క్రితం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించగా పవన్‌ను గురువారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారని తెలిపారు పవన్‌ నుండి సెల్‌ఫోన్‌, కత్తి స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. హత్య కేసును చేధించడంలో ప్రతిభ చూపిన పోలీసులను డీసీపీ అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Gold And Silver Rate: బంగారం ధరలు ఢమాల్.. లక్ష నుంచి దిగజారుతూ..

తెలంగాణలో 22కోట్ల ఏళ్ల నాటి రాక్షసబల్లి అవశేషాలు

Congress: ఈటల.. దిగజారుడు రాజకీయం తగదు

పకృతి విధ్వంసానికి సీఎందే బాధ్యత: కేటీఆర్‌

ఆర్టీసీ సీసీఎస్‌లో 15 రోజుల్లోగా రూ.1,029 కోట్లు జమ చేయాలి

Read Latest Telangana News and National News

Updated Date - May 16 , 2025 | 09:37 AM