Instagram: ఇన్‌స్టాగ్రామ్ అంతపని చేసిందన్నమాట.. చివరకు ఏమైందంటే..
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:51 AM
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమగా మారి చివరకు అది కత్తిపోట్లకు దారితీసింది. బస్సుకోసం ఎదురుచూస్తున్న సూర్య (20) అనే యువతిని ప్రేమోన్మాది కత్తితో పొడిచాడు. వీరిద్దరికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం, అది ప్రేమగా మారింది. కాగా.. కొద్దిరోజులుగా తనను పట్టించుకోడం లేదని కోపం పెంచుకున్న ఆ యువకుడు ఆ విద్యార్థినిని కత్తితో పొడిచాడు.

కాలేజీ విద్యార్థినికి ప్రేమోన్మాది కత్తిపోట్లు..
చెన్నై: సేలం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండులో ఒక విద్యార్థినిని ప్రేమోన్మాది కత్తితో పొడిచాడు. ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా ప్రేమించుకుని, ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన ప్రియుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. స్థానిక పోలీసుల కథనం మేరకు... సేలం జిల్లా కారియపట్టికి చెందిన సూర్య (20) అనే యువతి బీఎస్సీ చదువుతోంది. ఆట్టయంపట్టికి చెందిన మోహన్ ప్రియన్ (19) అనే యువకుడు ఐఐటీ పూర్తి చేసి ఉపాధి కోసం గాలిస్తున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: Anupriya: అయ్యో అనుప్రియ.. ఎంతపని చేశావమ్మా.. ఏం జరిగిందంటే..
ఈ క్రమంలో సూర్య, మోహన్ ప్రియన్‌ల మధ్య ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో సూర్యకు వివాహం చేసేందుకు తల్లిదండ్రులు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. దీంతో తన ప్రియుడుతో మాట్లాడటం మానేసింది. దీన్ని జీర్ణించుకోలేని ప్రియన్ ఆమెపై కోపం పెంచుకున్నాడు.
ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 8.30 గంటల సమయంలో సూర్య సేలం పాత బస్టాండు వద్ద ఉండగా ప్రియన్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత తాను కూడా అదే కత్తితో తన చేతులను కోసుకున్నాడు. రక్తపుమడుగులో పడివున్న వారిద్దరినీ అక్కడవున్న వారు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రైవేట్ ఆస్పత్రి పొమ్మంటే.. సర్కారు దవాఖానా ప్రాణాలు నిలిపింది
తెలంగాణ పోలీసులకు సీఎం అభినందనలు
Read Latest Telangana News and National News