Share News

Hyderabad: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. బర్త్‌డే చేసుకుందామని పిలిచి..

ABN , Publish Date - Aug 01 , 2025 | 08:35 AM

పుట్టిన రోజు వేడుకలు చేసుకుందామని యువతిని పిలిచి అత్యాచారం చేసిన సంఘటన బాలానగర్‌ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్ధార్థరెడ్డి(24) అనే యువకుడికి నెల రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతితో పరిచయం ఏర్పడడంతో స్నేహితులయ్యారు.

Hyderabad: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. బర్త్‌డే చేసుకుందామని పిలిచి..

హైదరాబాద్: పుట్టిన రోజు వేడుకలు చేసుకుందామని యువతిని పిలిచి అత్యాచారం చేసిన సంఘటన బాలానగర్‌ పోలీస్‏స్టేషన్‌(Balanagar Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్ధార్థరెడ్డి(24) అనే యువకుడికి నెల రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో ఓ యువతితో పరిచయం ఏర్పడడంతో స్నేహితులయ్యారు. జూలై 30వ తేదీన తన పుట్టిన రోజని, వేడుకలు చేసుకుందామని ఆమె చెప్పడంతో అతడు అంగీకరించాడు.


city5.2.jpg

తన ఇంటికి రావాలని 29వ తేదీ రాత్రి యువతి కోసం క్యాబ్‌ బుక్‌ చేశాడు. ఆమె వెళ్లిన తర్వాత కొద్దిసేపు సరదాగా గడిపి బిర్యానీ తిన్నారు. ఇద్దరూ కలిసి మద్యం తాగిన తర్వాత అతడు ఆమెపై అత్యాచారం చేశాడు. బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు బాధితురాలు డయల్‌ 100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

దేవాదాయశాఖలో ఈ ఆఫీసు సేవలు షురూ..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 01 , 2025 | 08:35 AM