Hyderabad: ప్రేమించడం లేదనే మనస్తాపంతో... - ఐదో అంతస్తు నుంచి దూకి టెకీ ఆత్మహత్య
ABN , Publish Date - Apr 22 , 2025 | 10:12 AM
ప్రేమించడం లేదనే మనస్తాపంతో... ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన హైదరాబాద్ నగరంలోని కొంపల్లిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

- ఐదో అంతస్తు నుంచి దూకి టెకీ ఆత్మహత్య
హైదరాబాద్: చిన్ననాటి స్నేహితురాలు తన ప్రేమను అంగీకరించలేదనే మనస్తాపం చెందిన ఓ టెకీ ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.పేట్‌బషీరాబాద్ సీఐ విజయవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు(Tamil nadu) రాష్ట్రం కాంచీపురానికి చెందిన అదామ్ విజయ్(23) జెయిస్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్(Software Engineer)గా పని చేస్తున్నాడు. అతని తండ్రి అదామ్ సెల్వాన్ సౌదీలో ఉండగా తల్లి తమిళనాడులో ఉంటోంది.
ఈ వార్తను కూడా చదవండి: AV Ranganath: ఆక్రమణలు తొలగించండి.. లేదా కూల్చేస్తాం
తల్లిదండ్రులిద్దరూ కుటుంబం కలహాలతో విడిపోవడంతో మనశ్శాంతి కోసం విజయ్ నగరంలోని కొంపల్లి సెంట్రల్ పార్కుకు వచ్చి ఓ వసతిగృహంలో ఉంటూ వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు. అయితే, కాంచీపురంలోని తన చిన్ననాటి స్నేహితురాలితో చాటింగ్ చేస్తూ తన ప్రేమను వ్యక్తం చేశాడు. తాను ప్రేమించడంలేదని, మిమ్మల్ని స్నేహితుడిగానే చూస్తున్నానని ఆమె స్పష్టం చేసింది.
దీంతో మనస్తాపానికి గురైన విజయ్ ఆరు పేజీల సూసైడ్ నోట్ రాసి, ఐదంతస్తుల భవనంపై నుంచి ఆదివారం ఉదయం దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తీవ్రగాయాలకు గురైన అతడిని చికిత్స కోసం కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. పోలీసులు సూసైడ్ నోట్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసునమోదు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Price Record: బంగారం లకారం
గూగుల్ కీలక నిర్ణయం..ఆ కేసు పరిష్కారం కోసం రూ.20.24 కోట్లు చెల్లింపు
కేటీఆర్‌పై కేసులు కొట్టివేసిన హైకోర్టు
ACB: ఏసీబీ వలలో ఐదుగురు అధికారులు
Read Latest Telangana News and National News