Share News

Hyderabad: మార్కులు తక్కువ వచ్చాయని..

ABN , Publish Date - Apr 25 , 2025 | 07:37 AM

మార్కులు తక్కువ వచ్చాయని అవమానభారంతో.. ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన హైదరాబాద్ నగరంలోని మచ్చబొల్లారం, మధురానగర్‌ కాలనీలో జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: మార్కులు తక్కువ వచ్చాయని..

- విద్యార్థి బలవన్మరణం

హైదరాబాద్: పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని, అవమానంగా భావించిన విద్యార్థి వాష్‌రూమ్‌లోకి వెళ్లి టవల్‌తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అల్వాల్‌ పోలీసులు(Alwal Police) తెలిపిన వివరాల ప్రకారం మచ్చబొల్లారం, మధురానగర్‌ కాలనీకి చెందిన ఆనంద్‌చారి, సుచరిత దంపతులకు అశ్రిత్‌, స్నేహిత్‌(15) ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి ప్రైవేటు ఉద్యోగి కాగా, తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.

ఈ వార్తను కూడా చదవండి: Coffee: రోజూ మూడు కప్పుల కాఫీ మంచిదే..


పెద్ద కుమారుడు బీటెక్‌ చదువుతుండగా, స్నేహిత్‌ ఇంటర్‌ మొదటి సంవత్సరం ఎంపీసీలో చేరాడు. తాజాగా వచ్చిన ఇంటర్‌ ఫలితాల్లో స్నేహిత్‌కు 470 మార్కులకు గాను 325 మార్కులు వచ్చాయి. తల్లిదండ్రులతో తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి బాధపడ్డాడు. ‘పర్వాలేదు. ఇంప్రూవ్‌మెంట్‌ రాయచ్చు’ అని తల్లిదండ్రులు నచ్చచెప్పారు.


city1.2.jpg

అయినా స్నేహిత్‌ మనోవేదనకు గురయ్యాడు. బుధవారం సాయంత్రం స్నానానికి వెళ్లి వస్తానని చెప్పి వాష్‌రూమ్‌లో టవల్‌తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబసభ్యులు కొన ఊపిరితో ఉన్న స్నేహిత్‌ను చికిత్స నిమిత్సం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో స్నేహిత్‌ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు.


ఈ వార్తలు కూడా చదవండి

దేశ భద్రతపై కాంగ్రెస్‌ చౌకబారు రాజకీయాలు

పంచాయతీలకు ఎన్నికల్లేవు.. అభివృద్ధికి నిధుల్లేవు!

కౌశిక్‌ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట

పర్యాటకుల మతం అడిగి పాశవికంగా కాల్చారు

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 25 , 2025 | 07:37 AM