Hyderabad: మణికొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. వాటర్ ట్యాంకర్ ఢీకొని..
ABN , Publish Date - Jul 30 , 2025 | 06:55 AM
పిల్లలను స్కూటీపై ఎక్కించుకొని పాఠశాల వద్ద దించి వస్తుండగా మృత్యు రూపంలో వచ్చిన వాటర్‌ట్యాంకర్ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను బలితీసుకుంది. మణికొండ-పుప్పాల్‌గూడ పైపులైను రోడ్డులో సుందర్‌గార్డెన్ సమీపంలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.

- సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి
హైదరాబాద్: పిల్లలను స్కూటీపై ఎక్కించుకొని పాఠశాల వద్ద దించి వస్తుండగా మృత్యు రూపంలో వచ్చిన వాటర్‌ట్యాంకర్ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను బలితీసుకుంది. మణికొండ-పుప్పాల్‌గూడ(Manikonda-Puppalguda) పైపులైను రోడ్డులో సుందర్‌గార్డెన్ సమీపంలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. రాయదుర్గం పోలీసులు(Rayadurgam Police) తెలిపిన వివరాల ప్రకారం..
ఒంగోలు జిల్లా కందుకూరుకు చెందిన ఇరువూరి వెంకీ, ఇరువూరి శాలిని(34) ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరు పుప్పాల్‌గూడలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. మంగళవారం ఉదయం స్కూల్ బస్ మిస్ కావడంతో ఇద్దరు కుమార్తెలను తన స్కూటీపై ఎక్కించుకొని శాలిని జూబ్లీహిల్స్(Jubilee Hills)లోని భారతీయ విద్యాభవన్ వద్ద దింపి తిరుగు ప్రయాణమైంది.
మణికొండ-పుప్పాల్‌గూడ పైపు లైన్ మార్గంలో వేగంగా వచ్చిన ఓ వాటర్ ట్యాంకర్ స్కూటీని ఢీకొనడంతో ఆమె కింద పడిపోయింది. దీంతో ఆమె తలపై నుంచి వాహనం వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందిందని పోలీసులు తెలిపారు. శాలిని తమ్ముడు ఉమ్మనేని లోకేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రావణ మాసంలో శుభవార్త.. బంగారం, వెండి ధరల్లో ఊహించని తగ్గింపు!
బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటల దీక్ష
Read Latest Telangana News and National News