Share News

Hyderabad: ఉరేసుకొని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

ABN , Publish Date - Nov 15 , 2025 | 10:50 AM

భార్యభర్తల మధ్య నెలకొన్న గొడవతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గాంధీనగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ హరీష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని బోలక్‌పూర్‌ కృష్ణానగర్‌కు చెందిన ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేసే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సుర్వి విశాల్‌గౌడ్‌(28), మల్లాపూర్‌లో నివాసం ఉండే నవ్య(25)తో రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.

Hyderabad: ఉరేసుకొని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్: భార్యభర్తల మధ్య నెలకొన్న గొడవతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి(Software employee) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గాంధీనగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ హరీష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని బోలక్‌పూర్‌ కృష్ణానగర్‌కు చెందిన ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేసే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సుర్వి విశాల్‌గౌడ్‌(28), మల్లాపూర్‌లో నివాసం ఉండే నవ్య(25)తో రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగిన నాటినుంచి భార్యభర్తలకు మనస్పర్ధలు వచ్చి గొడవలు జరుగుతున్నాయి.


పలుమార్లు పెద్దలు చెప్పినా వినక ఇటీవల ఉప్పల్‌ పోలీస్ స్టేషన్‌లో నవ్య తన భర్త విశాల్‌గౌడ్‌పై కేసు పెట్టింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న విశాల్‌గౌడ్‌ ఇంట్లోనే వర్క్‌ఫ్రంహోంలో విధులు నిర్వహిస్తున్నాడు. గొడవ జరిగిన నాటి నుంచి భార్య నవ్య పుట్టింట్లోనే ఉంటుంది. గురువారం సాయంత్రం విశాల్‌గౌడ్‌ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ రూంలో లోపలి నుంచి గడియపెట్టుకొని సీలింగ్‌ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకున్నాడు. అయితే తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు బలవంతంగా తెరిచిచూడగా సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించాడు.


city9.jpg

వెంటనే కుటుంబ సభ్యులు అతడిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు వారు తెలిపారు. తమ కోడలు నవ్య, అత్తమామ, వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. శుక్రవారం గాంధీనగర్‌ పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

పది పరీక్షలకు 100 రోజుల ప్రణాళిక

Read Latest Telangana News and National News

Updated Date - Nov 15 , 2025 | 10:50 AM