Hyderabad: డేటింగ్ సైట్‌లో పరిచయమై..1.90 లక్షలకు టోకరా
ABN , Publish Date - Jul 03 , 2025 | 06:59 AM
ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో పరిచయమైన యువతి మాటలు నమ్మిన నగరానికి చెందిన యువకుడు రూ.1.90 లక్షలు పోగొట్టుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం నగరానికి చెందిన యువకుడు (28)కు ఆన్‌లైన్ డేటింగ్ యాప్ చాట్ జోజోలో ఓ యువతి పరిచయమైంది.

- ఉల్టా కేసు పెడతామని బెదిరింపు.. పోలీసులను ఆశ్రయించిన యువకుడు
హైదరాబాద్ సిటీ: ఆన్‌లైన్ డేటింగ్ యాప్(Online dating app)లో పరిచయమైన యువతి మాటలు నమ్మిన నగరానికి చెందిన యువకుడు రూ.1.90 లక్షలు పోగొట్టుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం నగరానికి చెందిన యువకుడు (28)కు ఆన్‌లైన్ డేటింగ్ యాప్ చాట్ జోజోలో ఓ యువతి పరిచయమైంది. ఆమెతో నిత్యం వాట్స్‌పలో చాటింగ్ చేసేవాడు. తనపేరు మాడుగుల శరణ్య అని, తాను అనాథ అని చెప్పుకుంది. ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, కనీసం తినేందుకు కూడా డబ్బులు లేవని కథలు చెప్పింది.
ఆమె మాటలు నమ్మిన యువకుడు పలు దఫాలుగా రూ.95 వేలు ఆమె సూచించిన ఖాతాలకు బదిలీ చేశాడు. ఉద్యోగం వచ్చిందని, రెండు రోజుల్లో డబ్బు చెల్లిస్తానని చెప్పిన యువతి తర్వాత స్పందించడం మానేసింది. రెండు రోజుల తర్వాత శరణ్య ఇంటి యజమానిని అంటూ ఓ వ్యక్తి వాట్సప్ కాల్ చేశాడు. ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుందని చెప్పాడు.
యువతి నుంచి తనకు రావాల్సిన డబ్బును ఇప్పిస్తానని నమ్మించిన సైబర్ నేరగాడు(Cyber criminal) పలు కారణాలు చెప్పి మరో రూ.95 వేలు వసూలు చేశాడు. అనంతరం డబ్బు తిరిగి అడిగితే ‘యువతిని ఆత్మహత్యకు ప్రేరేపించావు. నీపై కేసు పెడతా’ అని బెదిరించాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి.
12వ తరగతి బాలుడితో టీచరమ్మ బలవంతపు శృంగారం!
రేవంత్.. తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్!
Read Latest Telangana News and National News