Share News

Cyber Crime: ట్రేడింగ్‌ పేరుతో టోకరా.. రూ.10.39 లక్షలు గోవిందా..

ABN , Publish Date - Jul 25 , 2025 | 08:02 AM

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ స్కామ్‌లో నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రూ.10లక్షలకు పైగా మోసపోయారు. ఎన్‌జేహెచ్‌ఎన్‌ఐ అనే నకిలీ ట్రేడింగ్‌ యాప్‌ ద్వారా సైబర్‌నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

Cyber Crime: ట్రేడింగ్‌ పేరుతో టోకరా.. రూ.10.39 లక్షలు గోవిందా..

హైదరాబాద్‌ సిటీ: ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ స్కామ్‌లో నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రూ.10లక్షలకు పైగా మోసపోయారు. ఎన్‌జేహెచ్‌ఎన్‌ఐ అనే నకిలీ ట్రేడింగ్‌ యాప్‌ ద్వారా సైబర్‌నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైబర్‌ నేరగాళ్లు ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో ఎన్‌జె ఇన్వెస్టర్స్‌ అలయెన్స్‌, 756 ఎన్‌జె లక్ష్మీ వెల్త్‌ పేర్లతో ఆకర్షణీయమైన ప్రకటనలతో ప్రచారం నిర్వహించారు.


city1.2.jpg

ఆకర్షితులైన వారిని వాట్సాప్‌ గ్రూప్‌(WhatsApp group)లలో చేరమని ప్రేరేపించారు. అనంతరం ట్రేడింగ్‌ యాప్‌లో డబ్బులను డిపాజిట్‌ చేయించారు. ఇలా ఒకరి నుంచి రూ.2లక్షలు, ఇంకొకరి నుంచి రూ.8.39లక్షలను పెట్టుబడులుగా పెట్టించారు. ఒకేసారి రూ.90 లక్షలు లాభం వచ్చినట్లు ఫేక్‌ యాప్‌లో చూపించారు.


city1.3.jpg

దీంతో బాధితుడు ఆ డబ్బులను విత్‌డ్రా చేసుకుందామని అనుకుంటే అవి కావడం లేదు. ఇదే విషయమై నిర్వాహకులను అడిగితే లాభాల్లో సర్వీసు చార్జీ 10 శాతం ముందే చెల్లించాలని సూచించారు. ఆ తర్వాత సైబర్‌ నేరగాళ్లు అకౌంట్‌ను బ్లాక్‌ చేశారు. ఇదంతా మోసమని గుర్తించిన బాధితులు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

అప్పులు తీర్చలేక ఇద్దరు రైతుల ఆత్మహత్య

Read Latest Telangana News and National News

Updated Date - Jul 25 , 2025 | 08:02 AM