Share News

Hyderabad: మరిన్ని డబ్బులు అడిగినందుకే చంపేశాడు..

ABN , Publish Date - Jan 28 , 2025 | 07:14 AM

మేడ్చల్‌ మునీరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు(Medchal Munirabad Outer Ring Road) కల్వర్టు కింద ఈనెల 24న జరిగిన మహిళ హత్యకేసు మిస్టరీ వీడింది. గుర్తుతెలియని మహిళ హత్యగా నమోదైన కేసును మేడ్చల్‌ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు.

Hyderabad: మరిన్ని డబ్బులు అడిగినందుకే చంపేశాడు..

- ఓఆర్‌ఆర్‌ వద్ద జరిగిన హత్య కేసును ఛేదించిన మేడ్చల్‌ పోలీసులు

హైదరాబాద్: మేడ్చల్‌ మునీరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు(Medchal Munirabad Outer Ring Road) కల్వర్టు కింద ఈనెల 24న జరిగిన మహిళ హత్యకేసు మిస్టరీ వీడింది. గుర్తుతెలియని మహిళ హత్యగా నమోదైన కేసును మేడ్చల్‌ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మేడ్చల్‌ జోన్‌ డీసీపీ కోటిరెడ్డి, అడిషనల్‌ డీసీపీ పురుషోత్తం, ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డిలతో కలసి వివరాలు వెల్లడించారు.

ఈ వార్తను కూడా చదవండి: మంటల్లో కాలిపోయిన బోట్‌ ఘటన.. హుస్సేన్‌సాగర్‌లో యువకుడి గల్లంతు


city1.2.jpg

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కి చెందిన శివానంద కుటుంబ సభ్యులతో గొడవపడి నగరానికి వచ్చి కుషాయిగూడలో ఉంటూ కూలిగా పనిచేస్తుండేది. కరీంనగర్‌ జిల్లా కమలాపురానికి చెందిన షేక్‌ ఇమామ్‌(37) శామీర్‌పేట్‌లోని మసీద్‌పూర్‌లో నివాసం ఉంటూ డేవిడ్‌(David) కటింగ్‌స్టోన్‌ కంపెనీలో పనిచేసేవాడు. ఈ క్రమంలో ఒకసారి మేడ్చల్‌ వెళ్లిన ఇమామ్‌కు అక్కడి బస్టాండ్‌లో కనిపించిన మహిళతో మాట కలిపాడు. అనంతరం ఆమెను బైక్‌పై మునీరాబాద్‌ సమీపంలోని కల్వర్ట్‌ వద్దకు తీసుకెళ్లి లైంగికవాంఛ తీర్చుకొన్నాడు.


ఆ తరువాత మహిళకు రూ.500 ఇచ్చాడు. మరిన్ని డబ్బుల కోసం ఆమె డిమాండ్‌ చేయడంతో ఇద్దరిమధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన ఇమామ్‌ ఆమె మెడను గట్టిగా పట్టుకోడంతో అపస్మారకస్థితికి చేరుకుంది. ఆపై పక్కనే ఉన్న బండరాయితో ఆమె తలపై కొట్టి చంపేశాడు. శరీరంపై పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. అనంతరం బైక్‌పై పారిపోయాడు. స్థానికుల ఫిర్యాదుతో మేడ్చల్‌ పోలీసులు(Medchal Police) కేసు నమోదు చేశారు.

city1.3.jpg


ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: టకీ టకీ భరోసా..

ఈవార్తను కూడా చదవండి: పరిగిలో పట్టపగలే చోరీ

ఈవార్తను కూడా చదవండి: సూర్యాపేటలో యువకుడి పరువు హత్య?

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్

Read Latest Telangana News and National News

Updated Date - Jan 28 , 2025 | 07:33 AM