Share News

Road accident: కల్యాణం చూడకనే.. కన్ను మూశాడు..

ABN , Publish Date - Jan 21 , 2025 | 01:16 PM

కన్నబిడ్డ పెళ్లి కనులారా చూసి సంబరపడాలని భావించిన తండ్రి ప్రమాదవశాత్తు మృతి చెందినా భార్య, కుమార్తెలకు విషయం తెలపకుండా బంధుమిత్రులు పెళ్లి జరిపించిన హృదయవిచారకర సంఘటన చిక్కమగళూరు(Chikmagalur) జిల్లాలో చోటు చేసుకుంది.

Road accident: కల్యాణం చూడకనే.. కన్ను మూశాడు..

- ఓ వైపు కుమార్తె వివాహం.. మరోవైపు రోడ్డు ప్రమాదంలో తండ్రి దుర్మరణం

- చిక్కమగళూరులో విషాదకర ఘటన

బెంగళూరు: కన్నబిడ్డ పెళ్లి కనులారా చూసి సంబరపడాలని భావించిన తండ్రి ప్రమాదవశాత్తు మృతి చెందినా భార్య, కుమార్తెలకు విషయం తెలపకుండా బంధుమిత్రులు పెళ్లి జరిపించిన హృదయవిచారకర సంఘటన చిక్కమగళూరు(Chikmagalur) జిల్లాలో చోటు చేసుకుంది. తాలూకా కేంద్రమైన తరికెరెలో చంద్రు కుమార్తె దీక్షిత(Deekshita) పెళ్లి సోమవారం జరగాల్సి ఉంది. ఆదివారం రిసెప్షన్‌ వేడుక ఉండేది.

ఈ వార్తను కూడా చదవండి: Arrest: భర్తను హతమార్చేందుకు పన్నాగం.. భార్య సహా ముగ్గురి అరెస్ట్‌


pandu1.jpg

ఆదివారం ఉదయం పెళ్లి ఏర్పాట్లలో భాగంగా ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో చంద్రు (45) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం కుమార్తె, భార్యకు తెలిస్తే పెళ్లి ఆగిపోతుందని బంధువులు ఎవరూ చెప్పకుండా దాచారు. చంద్రు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం గదిలో ఉంచారు. రాత్రి రిసెప్షన్‌ వేళ వధువుతోపాటు తల్లి ఎదురుచూశారు. ఇదే సమయంలో బంధువులు చంద్రు(Chandru) కొన్నిరోజులుగా అలసట లేకుండా పనిచేసి అస్వస్థతకు గురయ్యారని, ఒకరోజు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో అడ్మిట్‌ చేశామని చెప్పారు.


పెళ్లి సమయానికి వస్తారని రాత్రి దాటవేశారు. ఉదయం వధువు తండ్రి ఎక్కడంటూ ఆరా తీసినా ఎవరూ సమాచారం ఇవ్వలేదు. సోమవారం ఉదయం 10 గంటలకు పెళ్లి వేడుక ముగిసింది. కాసేపటికే చంద్రు మృతి చెందిన విషయం బహిర్గతమయ్యింది. వధూవరులు పెళ్లిబట్టలతోనే నేరుగా ఆసుపత్రికి పరుగులు తీశారు. తండ్రి మృతదేహాన్ని చూసి కుమార్తె రోదించడం అందరికీ కలచివేసింది. వివాహ వేడుకలు విషాదంతో ముగియడంతో అందరూ కన్నీరు మున్నీరయ్యారు.


ఈవార్తను కూడా చదవండి: Liquor Price Hike: మద్యం కంపెనీలకు కిక్కు!

ఈవార్తను కూడా చదవండి: Damodhar: క్షేమంగానే దామోదర్‌?

ఈవార్తను కూడా చదవండి: 40-50 కిలోమీటర్లకో టోల్‌ప్లాజా

ఈవార్తను కూడా చదవండి: రైతులకు అన్యాయం చేయొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 21 , 2025 | 01:16 PM