Share News

Website: శ్రీశైలం వైశ్య సత్రం పేరుతో నకిలీ వెబ్‌సైట్‌..

ABN , Publish Date - Apr 24 , 2025 | 09:41 AM

సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలకు తెరలేపారు. ఇప్పటికే వివిధ పద్దతుల్లో కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్న ఈ కేటుగాళ్లు తాజాగా.. నకిలీ వెబ్‌సైట్‌ సృష్టించి భక్తులను దోచుకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Website: శ్రీశైలం వైశ్య సత్రం పేరుతో నకిలీ వెబ్‌సైట్‌..

- భక్తులను దోచుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్‌ సిటీ: నకిలీ వెబ్‌సైట్‌ సృష్టించి భక్తులను సైబర్‌ నేరగాళ్లు దోచుకుంటున్నారు. సత్రంలో రూమ్స్‌ బుక్‌ చేసుకున్న వారిని టార్గెట్‌ చేసి, జీఎస్‌టీ, ఇతర ఖర్చుల పేరుతో వేధిస్తున్నారు. లేదంటే డబ్బులు రీఫండ్‌ చేస్తామంటూ నమ్మించి అందినంతా దండుకుంటున్నారు. రెండు రోజుల క్రితం నగర వాసిని టార్గెట్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) అతన్ని బురిడీ కొట్టించి రూ. 1.33లక్షలు కొల్లగొట్టారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరా నికి చెందిన 31 ఏళ్ల ప్రైవేట్‌ ఉద్యోగి దైవదర్శనానికి ప్లాన్‌ చేసుకున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Summer: నగరంలో.. భానుడి భగభగలు


అందులో భాగంగా శ్రీశైలం దేవస్థానం వెబ్‌సైట్లోకి వెళ్లి వైశ్య సత్రంలో రూమ్‌ను బుక్‌ చేసుకున్నాడు. అందుకు రూ.1000లు చార్జి చెల్లించాడు. ఆ తర్వాత గుర్తుతెలియని వ్యక్తి లైన్‌లోకి వచ్చాడు. మీరు కేవలం గది అద్దెను మాత్రమే చెల్లించారని, జీఎస్టీ రూ. 180లు చెల్లించాలని సూచిం చాడు. అందుకు బాధితుడు అంగీకరించలేదు. దాంతో మీ డబ్బులు రీఫండ్‌ చేస్తామని చెప్పడంతో సరే అన్నాడు. రిఫండ్‌ ప్రాసెస్‌ ప్రారంభిం చాడు. ముందుగా బాధితుడుని రూ. 1 పంపాలని సూచిం చాడు. ఒక్క రూపాయి పంపిన తర్వాత సైబర్‌ నేరగాడు తిరిగి రూ. 2 పంపించాడు.


అనంతర మీరు చెల్లించిన రూ. 1000, జీఎస్‌టీ రూ. 180 మొత్తం రూ. 1180లు చెల్లించండి నేను రెట్టింపు డబ్బులు పంపుతాను అంటూ నమ్మించాడు. ఇలా విడతల వారీగా దాదాపు రూ. 1.33 లక్షలు వసూల్‌ చేశాడు. తర్వాత సర్వర్‌ ప్రాబ్లమ్‌ వచ్చిందని తప్పించుకున్నాడు. బాధితుడు అతన్ని గట్టిగా నిలదీయడంతో స్పందించడం మానేశాడు. ఇదంతా సైబర్‌ మోసమని గుర్తించిన బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ద్వారా కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ముగ్గురు ఇంటర్‌ విద్యార్థినుల ఆత్మహత్య

బిర్యాని.. బీ కేర్‌ఫుల్‌..

చంచల్‌గూడ జైలుకు అఘోరీ

ఫినాయిల్‌, సబ్బుల పైసలు నొక్కేశారు

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 24 , 2025 | 09:41 AM