Cyber Crime: 8 సెకన్లకో సైబర్ మోసం..
ABN , Publish Date - Aug 01 , 2025 | 07:40 AM
దేశంలో ప్రతీ 8 సెకన్లకు ఒకరు సైబర్ మోసం బారిన పడుతున్నారని, 2023తో పోల్చితే 2024లో సైబర్ నేరాలు 209 శాతం పెరిగాయని ప్రభుత్వ నివేదికలో వెల్లడైంది. రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 2024లో సైబర్ నేరగాళ్లు 22,854 కోట్లు కొల్లగొట్టారు.

- గతేడాది దేశంలో రూ.22,845 కోట్లు కొల్లగొట్టిన నేరగాళ్లు
హైదరాబాద్ సిటీ: దేశంలో ప్రతీ 8 సెకన్లకు ఒకరు సైబర్ మోసం బారిన పడుతున్నారని, 2023తో పోల్చితే 2024లో సైబర్ నేరాలు 209 శాతం పెరిగాయని ప్రభుత్వ నివేదికలో వెల్లడైంది. రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలు(Cybercrimes) ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 2024లో సైబర్ నేరగాళ్లు 22,854 కోట్లు కొల్లగొట్టారు. దాదాపు 36 లక్షల మంది మోసపూరిత లింక్‌ను తెరవడం, మోసగాళ్ల ఫోన్‌లకు స్పందించడం ద్వారా డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ మోసాలపై నిరంతరం పనిచేస్తున్న సైబర్ దోస్ట్ (ఐ4సీ) కేంద్రం 2024లో 17.84 లక్షల ఫిర్యాదులు స్వీకరించడంతోపాటు నేరగాళ్లు కాజేసిన రూ.5,489 కోట్లను ఫ్రీజ్ చేసింది.
నేరాలను కట్టడి చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 9.42 లక్షల సిమ్ కార్డులు, 2.63 లక్షల ఈఎంఐఈ నంబర్లను బ్లాక్ చేసింది. నేరగాళ్లకు ఖాతాలు ఇచ్చి సహకరించే లక్ష మందిని గుర్తించింది. వివిధ బ్యాంకుల్లో నేరగాళ్లకు సంబంధించిన 24 లక్షల మ్యూల్ ఖాతాలను గుర్తించిన ప్రభుత్వం వాటిని ఫ్రీజ్ చేసింది. దేశ వ్యాప్తంగా నమోదైన సైబర్ నేరాల కేసులకు సంబంధించి 10,599 మంది నేరగాళ్లను అరెస్ట్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వ నివేదికలో వెల్లడైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
దేవాదాయశాఖలో ఈ ఆఫీసు సేవలు షురూ..
Read Latest Telangana News and National News