Share News

Hyderabad: విద్యుత్‌ బిల్లు బకాయి పేరిట వృద్ధుడికి బురిడీ

ABN , Publish Date - Apr 23 , 2025 | 07:57 AM

హైదరాబాద్ నగరం సైబర్ నేరగాళ్లకు అడ్డాగా మారిందనే విమర్శలొస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఈ సైబర్ మోసం జరుగుతూనే ఉంది. నగరంలోని ఓ ఏరియాకు చెందిన వృద్ధుడి(78)ని బురిడీ కొట్టించి రూ.3.99లక్షలు కొట్టేశారు. ఈ సైబర్ నేరాలపై ఇంకా ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండటం, సైబర్ మోసగాళ్లు పోలీసుల మాదిరిగా, బ్యాంకు అధికారుల లాగే మాట్లాడుతుండడంతో మోసపోవాల్సి వస్తోంది.

Hyderabad: విద్యుత్‌ బిల్లు బకాయి పేరిట వృద్ధుడికి బురిడీ

- రూ.3.99లక్షలు కొట్టేసిన సైబర్‌ కేటుగాడు

- వీడియో కాల్‌లో ఉండి మస్కా కొట్టిన వైనం

హైదరాబాద్‌ సిటీ: విద్యుత్‌ బిల్లు బకాయిల పేరిట జరుగుతున్న సైబర్‌ మోసాలు ఆగడం లేదు. మీ విద్యుత్‌ బిల్లు బకాయి ఉంది, వెంటనే చెల్లించకపోతే సరఫరా నిలిపేస్తామని మాటలతో హడలెత్తించి.. అమాయకుల బ్యాంకు ఖాతాల్లోని డబ్బు కాజేయడం సైబర్‌ కేటుగాళ్లకు అలవాటుగా మారింది. ఇదే క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఓ వృద్ధుడి(78)ని బురిడీ కొట్టించిన ఓ సైబర్‌ నేరగాడు.. అతని వద్ద నుంచి ఏకంగా రూ.3.99 లక్షలు కాజేశాడు. బాధిత వృద్ధుడితో వీడియో కాల్‌ మాట్లాడుతూ మోసానికి పాల్పడ్డాడు.

ఈ వార్తను కూడా చదవండి: Temperatures: మార్నింగ్‌ నుంచే మాడుతోంది..


ఇందుకు సంబంధించి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ విభాగం డీసీపీ కవిత తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన బాధిత వృద్ధుడి ఫోన్‌కి ఇటీవల గుర్తు తెలియని నెంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది. వృద్ధుడు ఆ కాల్‌కు స్పందించగా.. తనని తాను విద్యుత్‌ శాఖ ఉద్యోగిగా పరిచయం చేసుకున్న అవతలి వ్యక్తి.. విద్యుత్‌ బిల్లు బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పాడు. లేనిపక్షంలో విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరించాడు.


city2.jpg

అయితే, తాను బిల్లులు చెల్లించానని, ఎలాంటి బకాయిలు లేవని బాధితుడు పదేపదే చెప్పాడు. ఆపై, బాధితుడికి వీడియో కాల్‌ చేసిన సైబర్‌ నేరగాడు.. రికార్డుల్లో తేడాలు ఉండి ఉంటాయని, వాటిని సరిచేసేందుకు తాను పంపిన లింక్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించాడు. ఇదంతా నిజమని నమ్మిన బాధిత వృద్ధుడు.. ఆ లింక్‌ ఓపెన్‌ చేసి సైబర్‌ నేరగాడి సూచనల మేరకు విద్యుత్‌ మీటర్‌, బిల్లు చెల్లింపునకు సంబంధించిన వివరాలు నమోదు చేశాడు.


ఈ క్రమంలో బాధితుడు క్రెడిట్‌ కార్డు ద్వారా బిల్లు చెల్లించినట్లు తెలుసుకున్న సైబర్‌ నేరగాడు ఆయా వివరాలు తీసుకుని వీడియో కాల్‌లో ఉండగానే విడతల వారీగా రూ.3.99లక్షలు కొట్టేశాడు. ఆయా లావాదేవీలకు సంబంధించిన మెసేజ్‌లు చూసుకుని బాధిత వృద్ధుడు ప్రశ్నించే లోపే సైబర్‌ నేరగాడు కాల్‌ కట్‌ చేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధిత వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి

ఆర్టీసీలో సమ్మెకు సై...జేఏసీకి సంఘాల మద్దతు

ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై

Singareni: సింగరేణి ఉపకార వేతనం

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 23 , 2025 | 07:57 AM