Share News

Chennai News: గిఫ్ట్‌ ప్యాక్‌ పేరిట టోకరా.. రూ.47 లక్షలు గోవిందా..

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:20 PM

లండన్‌ నుంచి గిఫ్ట్‌ ప్యాక్‌ పంపుతున్నామంటూ మాజీ ప్రభుత్వ ఉద్యోగిని దగ్గర రూ.47 లక్షల కాజేసిన అపరిచిత వ్యక్తుల కోసం సైబర్‌ క్రైం పోలీసులు గాలిస్తున్నారు. తంజావూరు వైద్య కళాశాల రోడ్డుకు చెందిన 64 ఏళ్ల మాజీ ప్రభుత్వ ఉద్యోగిని సెల్‌ఫోన్‌కు జూలై 8వ తేది ఫోన్‌ చేసిన ఓ మహిళ తాను ఆ ఉద్యోగి క్లాస్‌మేట్‌నంటూ పరిచయం చేసుకుంది.

Chennai News: గిఫ్ట్‌ ప్యాక్‌ పేరిట టోకరా.. రూ.47 లక్షలు గోవిందా..

- వృద్ధురాలికి రూ.47 లక్షల మోసం

చెన్నై: లండన్‌ నుంచి గిఫ్ట్‌ ప్యాక్‌ పంపుతున్నామంటూ మాజీ ప్రభుత్వ ఉద్యోగిని దగ్గర రూ.47 లక్షల కాజేసిన అపరిచిత వ్యక్తుల కోసం సైబర్‌ క్రైం పోలీసులు గాలిస్తున్నారు. తంజావూరు(Tanjavuru) వైద్య కళాశాల రోడ్డుకు చెందిన 64 ఏళ్ల మాజీ ప్రభుత్వ ఉద్యోగిని సెల్‌ఫోన్‌కు జూలై 8వ తేది ఫోన్‌ చేసిన ఓ మహిళ తాను ఆ ఉద్యోగి క్లాస్‌మేట్‌నంటూ పరిచయం చేసుకుంది. ఆమె క్లాస్‌మేట్స్‌ పేర్లు కూడా చెప్పడంతో ఆమెకు నమ్మకం కుదిరింది.


తన భర్త చనిపోవడంతో ప్రస్తుతం ఒంటరిగా లండన్‌లో ఉంటున్నట్లు ఆ మహిళ తెలిపింది. అప్పటి నుంచి తరచూ ఇద్దరూ వాట్సాప్(Whats App)లో మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో, లండన్‌ నుంచి గిఫ్ట్‌ ప్యాక్‌ పంపుతున్నట్లు ఆ మహిళ తెలిపింది. కొద్దిరోజుల అనంతరం లండన్‌ విమానాశ్రయం ఎయిర్‌లైన్‌ కార్గో ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నామని, లండన్‌ నుంచి మీకు రూ.40 లక్షల విలువైన గిఫ్ట్‌ ప్యాక్‌ పంపుతున్నట్లు, అందుకు ఫీజుగా రూ.1.50 లక్షలు చెల్లించాలని కోరారు. ఈ విషయమై ఆమె లండన్‌ మహిళను సంప్రదించగా, ప్రస్తుతం ఫీజు చెల్లించండి, తాను ఇండియా వచ్చిన తర్వాత ఆ నగదు ఇస్తానని చెప్పింది.


nani3.2.jpg

ఈ మాటలు నమ్మిన ఆమె, ఏజెన్సీ చెప్పిన ఖాతాకు డిజిటల్‌ విధానంలో నగదు బదిలీ చేసింది. అనంతరం ఆ ఏజెన్సీ, పార్శిల్‌లో లండన్‌ నగదు (పౌండ్లు) వున్నాయని, అందుకు ఫీజు చెల్లించాలని చెప్పడంతో పాటు వివిధ కారణాలు చూపి, ఆ మహిళ నుంచి పలు విడతలుగా రూ.46.91 లక్షలు తీసుకున్నారు. ఎన్ని రోజులైనా పార్శిల్‌ రాకపోవడంతో బాధిత మహిళ, లండన్‌ మహిళను, కార్గో ఏజెన్సీ నెంబర్లను సంప్రదించగా, అవి పనిచేయడం లేదని తెలిసింది. ఈ వ్యవహారంపై బాధిత మహిళ ఫిర్యాదుతో తంజావూరు జిల్లా సైబర్‌ క్రైం పోలీసులు విచారణ చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. బంగారం ధర మరికొంచెం తగ్గింది..

కన్నీటి మంట ఊరట చెమ్మ!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 25 , 2025 | 12:20 PM