Share News

Tungabhadra: తుంగభద్రలో గల్లంతైన వైద్యురాలి మృతదేహం లభ్యం

ABN , Publish Date - Feb 21 , 2025 | 12:39 PM

గంగావతి తాలూకా సణాపుర గ్రామం వద్ద తుంగభద్ర నది(Tungabhadra River)లో ఈతకని వెళ్ళి నదిలో కొట్టుకుని పోయిన హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన ప్రైవేట్‌ ఆసుపత్రి వైద్యురాలు అనన్యరావు(26) మృత దేహాన్ని ఎట్టకేలకు గురువారం రక్షణ సిబ్బంది గుర్తించారు.

Tungabhadra: తుంగభద్రలో గల్లంతైన వైద్యురాలి మృతదేహం లభ్యం

బళ్లారి(బెంగళూరు): గంగావతి తాలూకా సణాపుర గ్రామం వద్ద తుంగభద్ర నది(Tungabhadra River)లో ఈతకని వెళ్ళి నదిలో కొట్టుకుని పోయిన హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన ప్రైవేట్‌ ఆసుపత్రి వైద్యురాలు అనన్యరావు(26) మృత దేహాన్ని ఎట్టకేలకు గురువారం రక్షణ సిబ్బంది గుర్తించారు. అగ్నిమాపక, పోలీసు శాఖ, జెఎస్‏డబ్ల్యూ సంస్థకు చెందిన రెస్క్యూటీమ్‌ స్థానికుల తెప్పలు వేసే యువకులు నిరంతరంగా ఒక రోజు పాటు కార్యచరణ చేసిన అనంతరం బుధవారం సాయంత్రం అనన్యరావ్‌ శవాన్ని కనుగొన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Bangalore: కాదన్నందుకే కడతేర్చాడు...


pandu2.jpg

హైదరాబాద్‌ సమీపంలోని నాంపల్లికి చెందిన అనన్యరావ్‌ సెలవు రోజులను తన స్నేహితులతో గడపడానికి గంగావతిలోని సణాపురం గ్రామానికి గెస్ట్‌ హౌస్‌లో బసచేశారు. బుధవారం ఉదయం గెస్ట్‌ హౌస్‌ వెనుక భాగంలో ఉన్న తుంగభద్ర నదిలో స్నేహితులతో ఈ కొట్టడానికి వెళ్ళిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనన్యరావ్‌ తెలంగాణకు చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కుమార్తెగా తెలిసింది.


pandu2.2.jpg

నదిలో నీటి ప్రమాణం ప్రవాహాన్ని తగ్గించి కార్యాచరణ జరపడంతో బండరాళ్ళ మధ్య అనన్యరావ్‌ మృతదేహాన్ని రక్షణ సిబ్బంది కనుగొన్నారు. మృతదేహం బయటకు తీస్తుండగానే వైద్యులు, కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. అనంతరం నదితీరంలోనే అనన్యరావ్‌కు వైద్యులు శవపరీక్షలు నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకెళ్ళారు.


ఈవార్తను కూడా చదవండి: Water Shortage: పట్టణాల్లో నీటికి కటకట

ఈవార్తను కూడా చదవండి: యువ వైద్యురాలి ప్రాణం తీసిన ఈత సరదా

ఈవార్తను కూడా చదవండి: చంద్రబాబుకు రేవంత్‌ గురుదక్షిణ

ఈవార్తను కూడా చదవండి: అడవి పందుల వేటకు వెళ్లి... విద్యుదాఘాతానికి ముగ్గురి బలి

Read Latest Telangana News and National News

Updated Date - Feb 21 , 2025 | 12:39 PM