Bengaluru News: దేవుడా.. ఎంతపనిచేశావయ్యా.. వివాహానికి ముందురోజు..
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:35 PM
వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.. వేడుకలకు బంధువులు అందరూ చేరుకున్నారు. గుండెపోటుతో వధువు కన్ను యూయడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. జీవితంలో కొత్త అధ్యాయానికి అడుగులు వేడయానికి సిద్ధమైన యువతి జీవితం అకస్మికంగా ముగిసిన సంఘటన చిక్కమగళూరు జిల్లా అజ్జంపుర తాలూకాలో గురువారం చోటు చేసుకుంది.
- గుండెపోటుతో వధువు మృతి
- పెళ్లింట విషాదం..
- అజ్జంపురలో సంఘటన
బెంగళూరు: వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.. వేడుకలకు బంధువులు అందరూ చేరుకున్నారు. గుండెపోటుతో వధువు కన్ను యూయడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. జీవితంలో కొత్త అధ్యాయానికి అడుగులు వేడయానికి సిద్ధమైన యువతి జీవితం అకస్మికంగా ముగిసిన సంఘటన చిక్కమగళూరు జిల్లా అజ్జంపుర తాలూకాలో గురువారం చోటు చేసుకుంది. 31న శుక్రవారం పెళ్లి జరగాల్సి ఉంది.

సొల్లాపుర(Sollapura) గ్రామానికి చెందిన శ్రుతి (24) ఆకస్మికంగా మృతి చెందింది. ప్రాథమిక సమాచారం ప్రకారం లో బీపీ, గుండెపోటుతోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. శ్రుతి వివాహం తరికెరె పట్టణంలో దిలీప్(Dilip)తో శుక్రవారం జరగాల్సి ఉంది. గురువారం మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఘటనపై అజ్జంపుర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
తుఫానును ఆపలేం... నష్టం తగ్గించాం
Read Latest Telangana News and National News