ATM: నగరంలో అంతర్రాష్ట్ర దొంగలు.. 2 రోజుల్లో 2 ఏటీఎంలు లూటీ
ABN , Publish Date - Mar 06 , 2025 | 08:11 AM
నగరంలో అంతర్రాష్ట్ర దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. రెండు రోజుల క్రితం రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎస్‌బీఐ ఏటీఎంను టార్గెట్ చేసిన దొంగలు కేవలం 4 నిమిషాల్లోనే 30 లక్షలు లూటీ చేశారు.

- శివారు ప్రాంతాలే లక్ష్యంగా దొంగతనాలు
- పాత గ్యాంగ్‌ల కోసం పోలీసుల వేట
- మరోవైపు కొత్త గ్యాంగ్‌లు హల్‌చల్
హైదరాబాద్ సిటీ: నగరంలో అంతర్రాష్ట్ర దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. రెండు రోజుల క్రితం రాచకొండ కమిషనరేట్(Rachakonda Commissionerate) పరిధిలో ఎస్‌బీఐ ఏటీఎంను టార్గెట్ చేసిన దొంగలు కేవలం 4 నిమిషాల్లోనే 30 లక్షలు లూటీ చేశారు. అదే ముఠా సైబరాబాద్ కమిషనరేట్ పరిధి మైలార్‌దేవ్‌పల్లి(Mailardevpally)లోనూ ఏటీఎం చోరీకి విఫలయత్నం చేసింది. దొంగతనానికి వీలు కాకపోవడంతో ఏటీఎంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మిషన్ దహనం కావడంతో పాటు అందులో ఉన్న సుమారు రూ.7లక్షలు కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. దోపిడీ జరిగిన విధానం, సీసీటీవీ కెమెరాల్లో దొంగల కదలికలను బట్టి ఈ రెండు ఘటనలూ ఒకే ముఠాకు చెందిన దొంగలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని పట్టుకోవడానికి సుమారు 10 పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి.
ఈ వార్తను కూడా చదవండి: Gandhi Hospital: అయినా అదే తీరు.. మంత్రి మందలించినా మారని గాంధీ ఆస్పత్రి వైద్యులు
కాల్పుల ఘటనలోనూ..
ఇటీవల అఫ్జల్‌గంజ్ పరిధిలో జరిగిన కాల్పుల ఘటనలోనూ దోపిడీ దొంగలు పారిపోయారు. అంతపెద్ద ఘటన జరిగినా సిటీ నలుమూలలా పోలీసులను అప్రమత్తం చేయలేదనే ఆరోపణలు వచ్చాయి. తిరుమలగిరి వరకు వెళ్లిన దొంగలు ఆ తర్వాత పోలీసుల కళ్లుగప్పి తిరిగి నగరంలోకి ప్రవేశించారు. ఆ రోజు అర్ధరాత్రి వరకూ నగరంలోనే గడిపి బీదర్‌లో కొట్టేసిన ఏటీఎం డబ్బులు రూ. 90 లక్షలతో ప్రైవేట్ ట్రావెల్స్‌లో తిరుపతికి చేరుకున్నారు. అక్కడి నుంచి చెన్నై ద్వారా రాష్ట్రం దాటి వెళ్లిపోయినట్లు పోలీసులు ఆలస్యంగా గుర్తించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్న తెలంగాణ ట్రై కమిషనరేట్ పోలీసులు సెన్సేషన్ కేసుల్లోనూ దొంగల ముఠాలను పట్టుకోవడంలో విఫలం అయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బ్యాంకర్ల భద్రతా వైఫల్యం
గతంలోనూ ఘరానా అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు నగరంలోని అనేక ప్రాంతాల్లో ఏటీఎం సెంటర్లను కొల్లగొట్టాయి. లక్షల రూపాయలను ఏటీఎంలో అప్‌లోడ్ చేస్తున్న బ్యాంకు అఽధికారులు వాటి రక్షణ మర్చిపోతున్నారు. కనీసం ఆయా సెంటర్ల వద్ద సెక్యూరిటీ సిబ్బందిని నియమించడం లేదు. ఏటీఎంలో చోరీకి ప్రయత్నిస్తే వెంటనే తెలిసేలా అలారం సిస్టం ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించినా చాలామంది పట్టించుకోలేదని పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రక్షణ చర్యలు లేని ఏటీఎంలనే దొంగలు టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: BJP victory: బీజేపీదే గెలుపు
ఈ వార్తను కూడా చదవండి: ఎస్సీ వర్గీకరణ.. బీసీ రిజర్వేషన్ల పెంపు!
ఈ వార్తను కూడా చదవండి: సీతారామ’తో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం
ఈ వార్తను కూడా చదవండి: Heatwave: భానుడి భగభగలు
Read Latest Telangana News and National News