Vi Offer: 2G వినియోగదారులకు వీఐ తీపి కబురు.. రీఛార్జ్‌లపై ఏడాదికి 24 రోజులు అదనపు గడువు..!
ABN , Publish Date - Jul 03 , 2025 | 01:40 PM
దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా, తమ 2G హ్యాండ్‌సెట్ వినియోగదారుల కోసం నూతనంగా వీ గ్యారెంటీ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఈ వినూత్న పథకం ద్వారా..

దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (Vi), తమ 2G హ్యాండ్‌సెట్ వినియోగదారుల కోసం నూతనంగా వీ గ్యారెంటీ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఈ వినూత్న పథకం ద్వారా, రూ. 199 ఆపై విలువ కలిగిన అపరిమిత ప్రీపెయిడ్ వాయిస్ ప్యాక్‌లపై వినియోగదారులు సంవత్సరానికి మొత్తం 24 రోజుల అదనపు గడువు ప్రయోజనం అందుకోనున్నారు.
పథకం వివరాలు..
ఈ కార్యక్రమం కింద, రూ. 199 అంతకంటే ఎక్కువ విలువ గల ప్రతి అపరిమిత వాయిస్ రీఛార్జ్ ప్యాక్‌పై 2 రోజుల అదనపు గడువును కస్టమర్ ఖాతాలో జమ చేస్తారు. ఈ 24 రోజుల అదనపు గడువు 12 నెలల వ్యవధిలో క్రెడిట్ అవుతుంది.
ఉద్దేశమిదే..
వాయిస్ మాత్రమే వాడే వారు, లేదా తక్కువ డేటా వినియోగించే ప్రీపెయిడ్ కస్టమర్లు ఎదుర్కొనే దీర్ఘకాల సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ఇది రూపొందించబడింది. సంప్రదాయ 28 రోజుల ప్యాక్‌లతో, వినియోగదారులు తరచుగా ఒకే క్యాలెండర్ నెలలో రెండుసార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు సేవలు మధ్యలో ఆగిపోతాయి. "వీ గ్యారెంటీ" ప్రారంభంతో, కస్టమర్‌లు ఇకపై సాధారణ 28 రోజులకు బదులుగా 30 రోజుల సర్వీస్ గడువు పొందుతారు. ఇది ప్రతి నెలా ఒకే రీఛార్జ్‌తో సరిపెట్టుకోవడానికి వీలు కల్పిస్తుంది. 28 రోజుల కన్నా ఎక్కువ గడువు ఉన్న రీఛార్జ్‌లలో సైతం, ఈ అదనపు రెండు రోజులు రీఛార్జ్ సైకిల్‌లో ఏర్పడే అంతరాలను పూరించి, ఎక్కువ సౌలభ్యాన్ని నిరంతర సేవలను అందిస్తాయి.
ఎవరు అర్హులు?
2G హ్యాండ్‌సెట్‌లను ఉపయోగిస్తూ, రూ. 199 ఆపై విలువైన అపరిమిత వాయిస్ రీఛార్జ్ ప్యాక్‌లు కలిగిన ప్రీపెయిడ్ కస్టమర్లందరికీ "వీ గ్యారెంటీ" ప్రయోజనం వర్తిస్తుంది.
ప్రయోజనాలు, గడువు వివరాలు..
వీ గ్యారెంటీ పథకం కింద, రూ. 199 రూ. 209 విలువ గల రెండు ప్రముఖ ప్యాక్‌లు అదనపు గడువును అందిస్తాయి. రూ. 199 ప్యాక్‌లో అపరిమిత కాల్స్‌తో పాటూ 2GB డేటా 300 SMS లభిస్తాయి. అయితే, అస్సాం, నార్త్ ఈస్ట్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, రాజస్థాన్ సర్కిళ్లలోని కస్టమర్లకు ఇదే ప్యాక్‌పై 3GB డేటా అందుతుంది. ఈ ప్యాక్ సాధారణ గడువు 28 రోజులు కాగా, వీ గ్యారెంటీ కింద అదనంగా 2 రోజులు లభిస్తాయి. ఇక రూ. 209 ప్యాక్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇందులో అపరిమిత కాల్స్‌తో పాటూ 2GB డేటా, 300 SMS కాలర్ ట్యూన్స్ అందించారు. పైన ప్రస్తావించిన ప్రత్యేక సర్కిళ్లకు చెందిన కస్టమర్లకు ఈ ప్యాక్‌లోనూ 3GB డేటా కాలర్ ట్యూన్స్ అందుతాయి. ఈ ప్యాక్ సైతం 28 రోజుల సాధారణ గడువును కలిగి ఉండగా, వీ గ్యారెంటీ ద్వారా అదనంగా 2 రోజులు అందుబాటులో ఉంటాయి. ఈ అదనపు గడువు ప్రయోజనం కస్టమర్‌లకు నిరంతర సేవలను అందించడంలో దోహదపడుతుంది.
ఇవి కూడా చదవండి
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి