Union Bank of India: ఖాతాదారులకు చెక్కుల పంపిణీ
ABN , Publish Date - Mar 05 , 2025 | 07:21 PM
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైఫాబాద్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో.. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని యూనియన్ బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించిన స్వర్ణభారత్ క్యాంపస్‌లో మెగా ఎమ్ఎస్ఎమ్ఈ అవుట్ రీచ్ క్యాంప్ నిర్వహించారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైఫాబాద్ ప్రాంతీయ కార్యాయం ఆధ్వర్యంలో.. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని యూనియన్ బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించిన స్వర్ణభారత్ క్యాంపస్‌లో మెగా ఎమ్ఎస్ఎమ్ఈ అవుట్ రీచ్ క్యాంప్ (MSME Outreach Camp) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మందాడి శ్రీలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 600 మంది ఖాతాదారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా MSME ఉత్పాదనలపై యూనియన్ బ్యాంక్ (Union Bank of India) ఖాతాదారులకు అవగాహన కల్పించారు. MSME సెక్టార్ రుణాలు అందించడం ద్వారా దేశంలో 65% మంది యువతకు జీవనోపాధి కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలోని 157 యూనియన్ బ్యాంక్ కార్యాలయాల్లో మార్చి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఈ క్యాంప్‌లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందిస్తు్న్నట్లు పేర్కొన్నారు.
అనంతరం సుమారు 50 మంది ఖాతాదారులకు సుమారు 100 కోట్ల విలువ చేసే రుణ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో MSME ముంబై వెర్టికల్ సీవో జీకే సుధాకర్ రావు, యూనియన్ బ్యాంక్ ముంబై సెంట్రల్ ఆఫీసు జనరల్ మేనేజర్ ఆర్ఎల్ పట్నాయక్, ఆ శాఖ హైదరాబాద్ జెడ్‌వో జనలర్ మేనేజర్ అజయ్ కుమార్, సైఫాబాద్ డీజీఎమ్ సోనాలిక, ఏజీఎంలు రవి, లేపాక్షి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.