Share News

Market Valuation: వారంలో టాప్ 6 కంపెనీల లాస్ రూ.78 వేల కోట్ల పైమాటే

ABN , Publish Date - May 26 , 2025 | 10:07 AM

గత వారం మన దేశంలోని టాప్-10 అత్యంత విలువైన కంపెనీలలో ఆరు కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.78,166.08 కోట్లు తగ్గింది. అయితే, టాప్-10 ప్యాక్ నుండి HDFC బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్ ITC మంచిగా లాభపడ్డాయి.

Market Valuation: వారంలో టాప్ 6 కంపెనీల లాస్ రూ.78 వేల కోట్ల పైమాటే
Combined Market Valuation

ఇంటర్నెట్ డెస్క్: Top 10 most valued firms eroded గత వారం మన దేశంలోని టాప్-10 అత్యంత విలువైన కంపెనీలలో ఆరు కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.78,166.08 కోట్లు తగ్గింది. అంటే, ఒక్క వారంలో టాప్ 6 కంపెనీల టోటల్ లాస్ రూ.78 వేల కోట్ల పైమాటేనన్నమాట. భారీగా నష్టపోయిన కంపెనీల్లో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికంగా లాస్ అయింది. ఈ కంపెనీ గడచిన ఐదు రోజుల్లో రూ. 40800,00,00,000 నష్టపోయింది. తర్వాత రతన్ టాటాకు చెందిన TCS కంపెనీ రూ. 17710,00,00,000 నష్టాన్ని చవిచూసింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.40,800.4 కోట్లు తగ్గి, మే 23 నాటికి రూ.19,30,339.56 కోట్లకు చేరుకుంది.

గత వారం రిలయన్స్ ఇండస్ట్రీస్, TCS, ICICI బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనిలీవర్ నష్టపోగా, టాప్-10 ప్యాక్ నుండి HDFC బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్ ITC లాభపడ్డాయి.

ఏ కంపెనీ ఎంత మేర తగ్గింది:

  • టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ విలువ రూ.17,710.54 కోట్లు తగ్గి రూ.12,71,395.95 కోట్లకు పడిపోయింది.

  • ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,488.58 కోట్లు తగ్గి రూ.6,49,876.91 కోట్లకు చేరుకుంది.

  • హిందూస్తాన్ యూనిలీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,462.8 కోట్లు తగ్గి రూ.5,53,974.88 కోట్లకు చేరుకుంది.

  • ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎంక్యాప్) రూ.2,454.31 కోట్లు తగ్గి రూ.10,33,868.01 కోట్లకు చేరుకుంది.

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,249.45 కోట్లు తగ్గి రూ.7,05,446.59 కోట్లకు చేరుకుంది.

ఏ కంపెనీ ఎంత మేర పెరిగింది:

  • భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,121.24 కోట్లు పెరిగి రూ.10,44,682.72 కోట్లకు చేరుకుంది.

  • బజాజ్ ఫైనాన్స్ విలువ రూ.4,548.87 కోట్లు పెరిగి రూ.5,74,207.54 కోట్లకు చేరుకుంది.

  • ఐటీసీ విలువ రూ.875.99 కోట్లు పెరిగి రూ.5,45,991.05 కోట్లకు చేరుకుంది.

  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.399.93 కోట్లు పెరిగి రూ.14,80,723.47 కోట్లకు చేరుకుంది.

ఇక, రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యంత విలువైన సంస్థగా కొనసాగింది. ఆ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, హిందూస్తాన్ యూనిలీవర్, ఐటీసీ విలువైన సంస్థల జాబితాలో ఉన్నాయి.


ఇవి కూడా చదవండి

Shashi Tharoor: పార్టీ కోసమే పని చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన శశిథరూర్

ponnam prabhakar: తల్లిదండ్రులు వారి పిల్లలను శక్తి మేర చదివించాలి: పొన్నం

Updated Date - May 26 , 2025 | 02:58 PM