Share News

Tax slabs : పాతదా? కొత్తదా? మీకేది మేలో ఇక్కడ చూడండి..

ABN , Publish Date - Feb 02 , 2025 | 05:04 AM

కొత్త పన్ను విధానం ప్రకారం ఏకంగా రూ.12.75 లక్షల దాకా ఎలాంటి పన్నూ పడదంటూనే.. ఆదాయం అంతకు మించితే మళ్లీ రూ.4 లక్షల నుంచీ వివిధ శ్లాబుల ప్రకారం పన్ను పడుతుందని ఆర్థిక మంత్రి ప్రకటించడంతో చాలా మంది వేతన జీవులు డైలమాలో పడ్డారు!

Tax slabs : పాతదా? కొత్తదా? మీకేది మేలో ఇక్కడ చూడండి..
Budget 2025 Tax Slabs

Budget 2025-26: కొత్త పన్ను విధానం ప్రకారం ఏకంగా రూ.12.75 లక్షల దాకా ఎలాంటి పన్నూ పడదంటూనే.. ఆదాయం అంతకు మించితే మళ్లీ రూ.4 లక్షల నుంచీ వివిధ శ్లాబుల ప్రకారం పన్ను పడుతుందని ఆర్థిక మంత్రి ప్రకటించడంతో చాలా మంది వేతన జీవులు డైలమాలో పడ్డారు! తమకు వస్తున్న జీతం ప్రకారం పాత పన్ను విధానం మంచిదా? లేక కొత్త పన్ను విధానానికి వెళ్తే మేలా? తేల్చుకోలేక సతమతమవుతున్నారు. నిజానికి దేశవ్యాప్తంగా పన్ను రిటర్నులు దాఖలు చేసేవారిలో దాదాపు 71 శాతం మంది ఇప్పటికే కొత్త పన్ను విధానానికి మారినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పుడు పన్ను పరిమితిని ఏకంగా రూ.12 లక్షలకు పెంచేయడం, పన్ను శ్లాబులను కూడా పెంచడంతో ఇకపై మరింత మంది ఈ విధానం వైపు మొగ్గుచూపుతారని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, పెద్ద మొత్తంలో సేవింగ్స్‌ లేనివారికి, పిల్లల స్కూల్‌ ఫీజులు, గృహరుణాలు వంటివి లేనివారికి కొత్త పన్ను విధానం మంచిదని.. గరిష్ఠంగా తగ్గింపులను చూపించుకోగలిగితే మాత్రం ఇప్పటికీ పాత పన్ను విధానమే మెరుగని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మీకేది మెరుగో ఇక్కడ చూడండి

1.jpg

2.jpg

3.jpg


సులువుగా లెక్కేసే ఈజీట్యాక్స్‌ పన్ను కాలుక్యులేటర్‌

1FRAME.jpg

మనకు వచ్చే వార్షిక ఆదాయం, చూపగలిగే మినహాయింపులు/సేవింగ్స్‌/తగ్గింపుల ఆధారంగా.. పాత, కొత్త పన్ను విధానాల్లో ఏది ఎంచుకుంటే మనకు ఎక్కువ ఉపయోగమో సులభంగా తెలుసుకునేలా ‘ఈజీట్యాక్స్‌’ వెబ్‌సైట్‌ ఒక పన్ను కాలుక్యులేటర్‌ను రూపొందించింది. ఇదీ ఆ వెబ్‌ పేజీచిరునామా.. https://eztax.in/incometaxcalculator (లేదా) ఇక్కడున్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా ఆ పేజీలోకి వెళ్లొచ్చు.

Updated Date - Feb 02 , 2025 | 08:50 AM