Rule of 72: మీ డబ్బును రెట్టింపు చేసే ఈజీ ఫార్ములా.. దీని గురించి తెలుసా మీకు
ABN , Publish Date - Jul 28 , 2025 | 09:53 AM
మీరు మీ డబ్బును రెట్టింపు చేసుకోవాలని కలలు కంటున్నారా. దీనిని మీరు రూల్ ఆఫ్ 72 ట్రిక్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. దీంతో మీరు ఎక్కడ ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తే అది డబుల్ అవుతుందో క్షణాల్లోనే తెలిసిపోతుంది.

మీరు మీ డబ్బును పెంచుకోవాలని, రెట్టింపు చేసుకోవాలని ఆలోచిస్తున్నారా. అందుకు మీకోసం ఒక ఈజీ ట్రిక్ అందుబాటులో ఉంది. అదే రూల్ ఆఫ్ 72 (Rule of 72). ఈ ఫార్ములా మీ డబ్బు ఎంత సమయంలో రెట్టింపు అవుతుందో (how to double your money) లెక్కలు లేకుండా క్షణాల్లో చెప్పేస్తుంది. అదే దీని స్పెషల్.
రూల్ ఆఫ్ 72 అంటే ఏంటి?
రూల్ ఆఫ్ 72 అనేది ఆర్థిక రంగంలో మనీ రెట్టింపు కావడానికి సులభంగా తెలుసుకునే పరిష్కార మార్గం. ఇది మీ పెట్టుబడిపై వచ్చే వడ్డీ రేటు ఆధారంగా డబ్బు రెట్టింపు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో అంచనా వేస్తుంది. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD), మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ వంటి పథకాల్లో ఎక్కడ పెట్టుబడి పెట్టినా కూడా ఈ ఫార్ములా మీ డబ్బు ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.
ఈ ఫార్ములా ఎలా పని చేస్తుంది?
72 ÷ మీ పెట్టుబడిపై వార్షిక వడ్డీ రేటు (%) = డబ్బు రెట్టింపు కావడానికి పట్టే సంవత్సరాలు
ఉదాహరణకు మీరు ఒక ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే అక్కడ మీకు సంవత్సరానికి 6% వడ్డీ వస్తుందని అనుకుందాం. దీని ప్రకారం లెక్కించే విధానంలో 72 ÷ 6 = 12 సంవత్సరాలు. అంటే మీ లక్ష రూపాయలు, 2 లక్షలుగా మారడానికి దాదాపు 12 సంవత్సరాలు పడుతుంది.
ఇది ఎలా పని చేస్తుంది?
ఈ ఫార్ములా కాంపౌండ్ వడ్డీ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. కాంపౌండ్ వడ్డీలో మీరు పెట్టిన మొత్తంపై వచ్చే వడ్డీ మాత్రమే కాకుండా, ఆ వడ్డీపై కూడా మళ్లీ వడ్డీ యాడ్ అవుతుంది. ఇది మీ డబ్బును వేగంగా పెరిగేలా చేస్తుంది. రూల్ ఆఫ్ 72 ఈ పెరుగుదలను సులభంగా అంచనా వేయడానికి సహాయపడుతుంది.
మరికొన్ని ఉదాహరణలు
మ్యూచువల్ ఫండ్ (SIP): మీరు ఒక మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టారని భావిస్తే, అది సంవత్సరానికి సగటున 12% రాబడి ఇస్తుందని అనుకుందాం. లెక్కించే విధానం: 72 ÷ 12 = 6 సంవత్సరాలు. అంటే, మీ డబ్బు 6 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది.
అధిక రాబడి: మీ పెట్టుబడి సంవత్సరానికి 9% రాబడి ఇస్తే: 72 ÷ 9 = 8 సంవత్సరాలు. మీ డబ్బు 8 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది.
ఈ ఫార్ములా ఎందుకు ఉపయోగకరం?
క్షణాల్లో మీ డబ్బు రెట్టింపు కావడానికి పట్టే సమయాన్ని తెలుసుకోవచ్చు
బ్యాంక్ FD, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ వంటి వివిధ పెట్టుబడి ఎంపికలను సరిపోల్చడానికి ఈ ఫార్ములా సహాయపడుతుంది.
రూల్ ఆఫ్ 72, 6% నుంచి 10% మధ్య వడ్డీ రేట్లకు చాలా ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది. చాలా ఎక్కువ (20% కంటే ఎక్కువ) వడ్డీ రేట్ల విషయంలో ఇది పూర్తిగా ఖచ్చితం కాకపోవచ్చు. కానీ దాదాపుగా అంచనాకు ఉపయోగపడుతుంది.
ఇవి కూడా చదవండి
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి