Jio : జియో సిమ్ వాడుతున్నారా.. ఆ రెండు ప్లాన్స్ గోవిందా..
ABN , Publish Date - Jan 30 , 2025 | 05:19 PM
Jio : ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా.. రెండు వాయిస్ ఓన్లీ ప్లాన్లను ఇటీవల జియో ప్రవేశపెట్టింది. 84 రోజుల వ్యాలిడీటితో రూ. 458 ప్లాన్‌తోపాటు 365 రోజుల వ్యాలిడీటితో రూ. 1958 ప్లాన్ తీసుకువ వచ్చింది. వీటికి జియో టీవీ, సినిమా, క్లౌడ్ సబ్ స్క్రిప్షన్ సదుపాయాలను కలిపింది.

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కీలక నిర్ణయం తీసుకొంది. ప్రస్తుతం అమలు చేస్తున్న రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను తొలగించింది. వాయిస్, ఎస్సెమ్మెస్‌ల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలు తీసుకురావాలంటూ టెలికాం సంస్థలకు ట్రాయ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొత్త ప్లాన్లను జియో తీసుకు వచ్చింది. అదే సమయంలో పాత ప్లాన్లను తీసి వేసింది.
ఇప్పటి వరకు అందిస్తున్న రూ.189, రూ. 479 రీఛార్జి ప్లాన్లను తన వెబ్ సైట్ నుంచి తొలగించింది. తక్కువ డేటా, ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్ ప్లాన్లు కావాలనుకే యూజర్ల కోసం జియో గతంలో ఈ ప్లాన్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. రూ. 189 ప్లాన్ కింద 28 రోజులు వ్యాలిడిటీ ఉండగా... రూ. 479 ప్లాన్ కింద 84 రోజుల వ్యాలిడిటీ ఉండేది.
అయితే ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగా.. రెండు వాయిస్ ఓన్లీ ప్లాన్లను ఇటీవల జియో ప్రవేశపెట్టింది. 84 రోజుల వ్యాలిడీటితో రూ. 458 ప్లాన్‌తోపాటు 365 రోజుల వ్యాలిడీటితో రూ. 1958 ప్లాన్ తీసుకువ వచ్చింది. వీటికి జియో టీవీ, సినిమా, క్లౌడ్ సబ్ స్క్రిప్షన్ సదుపాయాలను కలిపింది.
Also Read: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్
Also Read: కేజ్రీవాల్ ఇరికించాలనుకొని.. ఇరుక్కుపోయారా?
ధరలు అధికంగా ఉన్నాయంటూ ట్రాయ్ పేర్కొన్న నేపథ్యంలో ఈ ప్రయోజనాలను అలాగే ఉంచుతూ ప్లాన్ ధరలను మాత్రం తగ్గించింది. దీంతో 458 ప్లాన్‌ను.. రూ. 448కు, అలాగే 1958 ప్లాన్‌ను 1748కి తగ్గించింది. ఆ క్రమంలో వాల్యూ ప్లాన్లను తొలగించింది.
For National News And Telugu News