Stock Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. లక్షల కోట్లు ఆవిరి..
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:26 PM
Stock Market Crash: అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నా భారత్-పాక్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో శుక్రవారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి.

Stock Market Crash: కాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో భారత మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి . అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉండటంతో లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ తర్వాత దాదాపు 950 పాయింట్లు నష్టపోయి ప్రస్తుతం 79,000 మార్కు కంటే దిగువన ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 24,000 పాయింట్ల కంటే దిగువకు పడిపోయింది.
నష్టాల్లో బ్యాంకింగ్ రంగం..
దేశంలోని మూడవ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన యాక్సిస్ బ్యాంక్ మార్చి త్రైమాసికంలో అంతగా ఆకట్టుకోలేకపోయింది. త్రైమాసిక లాభం గతేడాది ఇదే కాలంలో రూ.7,130 కోట్లు ఉండగా ప్రస్తుతం రూ.7,117 కోట్లకు తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. బ్యాంక్ షేర్లు 4.65% పడిపోవడం మదుపర్లను కలవరపెడుతోంది. యాక్సిస్ బ్యాంక్‌తో పాటు, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా ఇవాళ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో ఉన్నాయి.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు ఏ పరిస్థితులకు దారితీస్తాయోనని పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఆసియా మార్కెట్లు సహా ప్రపంచ మార్కెట్లు సానుకూల సంకేతాలు అందిస్తున్నాయి. దక్షిణ కొరియా కోస్పి ఇండెక్స్, టోక్యో నిక్కీ 225, హాంకాంగ్ హాంగ్ సెంగ్, షాంఘై SSE కాంపోజిట్ అన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. అమెరికా ఈక్విటీలలో కూడా ఇలాంటి ధోరణులు కనిపించాయి. నిన్న సాయంత్రం నాస్‌డాక్ కాంపోజిట్ 2.74 శాతం లాభపడింది. ఎస్ & పి 500 2 శాతం పైగా పెరిగింది, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1.23 శాతం పెరిగింది.
Read Also: Stock Market Closing: ఏడు రోజుల బుల్ ర్యాలీకి బ్రేక్.. నష్టాల్లో ముగిసిన భారత మార్కెట్లు
Tech Mahindra Q4 Results: టెక్ మహీంద్రా లాభం జూమ్
Gold Rates 25 Apr 2025: బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం ధర