Jio: తక్కువ ధరకే జియో 72 రోజుల ప్లాన్.. BSNL, ఎయిర్‌టెల్‌లకు సవాల్..
ABN , Publish Date - Jan 19 , 2025 | 02:42 PM
రిలయన్స్ జియో టెలికాం యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ప్రధాన పోటీదారులైన ఎయిర్‌టెల్, Vi, BSNL లకు సవాల్ చేస్తుంది. అయితే ఆ ప్లాన్ వివరాలేంటనేది ఇక్కడ తెలుసుకుందాం.

BSNL తక్కువ ధరలకు ప్లాన్స్ ఇస్తుండటంతో దేశంలో టెలింకాం సంస్థల మధ్య పోటీ పెరుగుతోంది. దీంతో అనేక మంది జియో(jio), ఎయిర్ టెల్ నుంచి క్రమంగా BSNLకు మారుతున్నారు. ఈ క్రమంలోనే జియో తన వినియోగదారులను కాపాడుకోవడంతోపాటు మరికొంత మందిని ఆకట్టుకోవడానికి సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. అదే జియో 72 రోజుల ప్లాన్. దీనిలో అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తోంది. రూ. 749 ధరకు ఈ ప్లాన్‌లో అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, అలాగే అన్ని నెట్‌వర్క్‌లకు ఉచిత కాలింగ్ అందించబడుతుంది. దీంతోపాటు వినియోగదారులు రోజుకు 100 ఉచిత SMSలను పొందుతారు. ఇది వారి అనుభవాన్ని మరింత సౌకర్యవంతం చేస్తుంది.
డేటా అలవెన్స్
జియో ఈ ప్లాన్‌లో వినియోగదారులకు 2GB రోజువారీ డేటాను కూడా అందిస్తారు. అంటే మొత్తం 144GB డేటా. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే, దీనిలో 20GB అదనపు డేటాను కూడా అందిస్తున్నారు. ఇది ఇంతకుముందు ఎవరూ అందించని ప్రత్యేక ఆఫర్ కాగా, ఈ ప్లాన్ 5G ట్రూ డేటా యాక్సెస్‌తో వస్తుంది. ఇది జియో వినియోగదారులకు అత్యాధునిక 5G కనెక్టివిటీని అందిస్తుంది.
అదనపు ప్రయోజనాలు
ఈ ప్లాన్‌తో పాటు జియో ఇతర అనేక అదనపు సేవలను కూడా అందిస్తుంది. సబ్‌స్క్రైబర్లు జియో సినిమాకి ఉచిత యాక్సెస్ పొందగలరు. ఇందులో వారు తమకు ఇష్టమైన సినిమాలను, షోలను చూడవచ్చు. అదే సమయంలో జియో టీవీ యాక్సెస్ కూడా లభిస్తుంది. దీంతో వినియోగదారులు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా టీవీ ఛానెల్‌లను చూస్తూ ఆనందించవచ్చు. అదనంగా జియో క్లౌడ్ సేవలను కూడా ఉచితంగా అందిస్తోంది. ఇది వినియోగదారులకు తమ డేటాను సురక్షితంగా నిల్వ చేసుకోవటానికి అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది. ఈ ఫీచర్లు జియో వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందిస్తాయి.
కస్టమర్లకు ఉచిత సేవలు
జియో తన కస్టమర్లను సంతోషపెట్టడం, వారి అవసరాలను తీర్చడం కోసం నిరంతరం శ్రమిస్తోంది. 72 రోజుల ప్లాన్‌తో పాటు జియో అందిస్తున్న అనేక అదనపు ప్రయోజనాలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. దీనికి తోడు జియో తన ప్లాన్లలో 5G యాక్సెస్‌ను కూడా అందించడం ద్వారా, వినియోగదారులకు వేగవంతమైన ఇంటర్నెట్ అనుభవాన్ని అందిస్తుంది. ప్రస్తుతం వినియోగదారుల సంఖ్య పరంగా జియో, ఎయిర్‌టెల్, Vi, BSNL వంటివి టాప్ 5లో ఉన్నాయి. కొంతకాలంగా జియో, ఎయిర్ టెల్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచడంతో అనేక మంది యూజర్లు BSNLకు మారుతున్నారు. దీంతో మళ్లీ వినియోగదారులను ఆకట్టుకునేందుక జియో ప్రయత్నం చేస్తుంది.
ఇవి కూడా చదవండి:
Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..
Narayana Murthy: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తికి షాక్.. భారీగా తగ్గిన సంపద
SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి
Budget 2025: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల ఖాతాల్లోకి రూ.10 వేలు
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Read More Business News and Latest Telugu News