Deepseek: డీప్‌సీక్ ఆ డేటా బహిర్గతం చేసిందన్న ఇజ్రాయెల్ సైబర్ సంస్థ
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:21 AM
ఇటివల మార్కెట్లోకి వచ్చిన చైనా ఏఐ డీప్‌సీక్ గురించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కంపెనీ ఓపెన్ ఇంటర్నెట్‌లో సున్నితమైన డేటాను భారీగా బహిర్గతం చేసిందని ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ 'విజ్' చెప్పింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

చైనాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ అయిన డీప్‌సీక్ (Deepseek) గురించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థ ఓపెన్ ఇంటర్నెట్‌లో సున్నితమైన డేటాను భారీగా బహిర్గతం చేసిందని ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ 'విజ్' తెలిపింది. ఈ అంశం గురించి విజ్ సంస్థ బ్లాగ్ పోస్టులో వివరాలను వెల్లడించింది. విజ్ చేసిన అన్వేషణలో డీప్‌సీక్ మౌలిక సదుపాయాలను స్కాన్ చేస్తున్నపుడు, డిజిటల్ సాఫ్ట్‌వేర్ కీలు, అలాగే ఉచిత AI అసిస్టెంట్ కోసం యూజర్ ప్రాంప్ట్‌లతో సహా చాట్ లాగ్‌లను కలిగిన మిలియన్ కంటే ఎక్కువ 'అన్‌సెక్యూర్డ్' (అనధికార) డేటా లైన్‌లు బయటపడ్డాయి. ఈ డేటా లీక్, ప్రపంచవ్యాప్తంగా టెక్ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
డేటా లీక్ గురించి..
ఈ కంపెనీ తన AI అసిస్టెంట్‌తో టెక్ పరిశ్రమలో సంచలనం సృష్టించినప్పటికీ, ఈ డేటా లీక్ కంపెనీకి చాలా పెద్ద ప్రశ్నలను తీసుకొస్తుంది. డీప్‌సీక్ సురక్షిత ప్రణాళికలను త్వరగా అమలు చేసి, అనేక గంటల్లోనే లీక్ అయిన డేటాను భద్రపరచడంలో సక్సెస్ అయ్యింది. విజ్ సైబర్ సెక్యూరిటీ విభాగం చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అమీ లుట్వాక్ డీప్‌సీక్ వేగవంతమైన స్పందనను మెచ్చుకున్నారు. కానీ అదే సమయంలో వారు డీప్‌సీక్ నుంచి బయటపడ్డ డేటాను కనుగొనడం ఒకే ఒక్క సంస్థ చేయడం కష్టం అని వారు భావించారు. ఈ క్రమంలో మిగతా ఇతర కంపెనీలను కూడా డీప్‌సీక్ డేటా లీక్ గురించి అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని అమీ లుట్వాక్ అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా..
ఇతర విషయాల్లో డీప్‌సీక్ AI అసిస్టెంట్ తన అనుకూలత, సౌలభ్యం వల్ల మంచి గుర్తింపు పొందింది. చాట్‌జీపీటీ వంటి ప్రపంచ స్థాయి పోటీదారులను కూడా అధిగమించి, సోమవారం నాటికి అమెరికన్ ఆపిల్ యాప్ స్టోర్ నుంచి డీప్‌సీక్ డౌన్‌లోడ్లలో టాప్ స్థానం దక్కించుకుంది. దీని ద్వారా ఈ కంపెనీ టెక్ పరిశ్రమలో సత్తాను మరోసారి నిరూపించింది. కానీ ఈ విజయం కొంతమందికి ఆందోళన కలిగించింది. అమెరికాలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు, ముఖ్యంగా ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, ఈ అనూహ్య విజయం తరువాత డీప్‌సీక్‌ను దగ్గరగా గమనించసాగాయి.
అనేక మార్పులు..
డీప్‌సీక్ తక్కువ ఖర్చుతో, OpenAI సామర్థ్యాలతో పోటీ పడగలిగే సామర్థ్యం వలన, మార్కెట్‌లో ఎక్కువ ప్రభావాలు ఏర్పడుతున్నాయి. ఈ కొత్త పరిణామాలు వ్యాపార నమూనాలపై ప్రభావం చూపించనున్నాయి. ఈ క్రమంలో డీప్‌సీక్, OpenAI, ఇతర టెక్ దిగ్గజాల మధ్య పోటీ ఏర్పడింది. ఈ డేటా లీక్ పరిణామం టెక్ పరిశ్రమలో ఆయా సంస్థలను మరింత అప్రమత్తం చేస్తుందని చెప్పవచ్చు. ఈ క్రమంలో సైబర్ సెక్యూరిటీ మార్గదర్శకాలను నిరంతరం అప్రమత్తం చేసి, AI వంటి సాంకేతిక రంగాలలో డేటా లీక్‌లు నివారించాల్సిన అవశ్యకత ఉంది.
ఇవి కూడా చదవండి:
Kumbh Mela 2025: ఒక్కరోజే కుంభమేళాకు 7.5 కోట్ల మంది.. ఇప్పటివరకు ఎంతంటే..
MahakumbhStampede: మహా కుంభమేళా తొక్కిసలాటపై సీఎం కీలక నిర్ణయం..
Union Budget 2025: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రులు.. ఎవరెవరంటే..
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News