Share News

Stock Markets Closing: కనుచూపు మేర పచ్చని పైరులా నేటి స్టాక్ మార్కెట్లు

ABN , Publish Date - Jun 20 , 2025 | 04:57 PM

ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య గత కొన్ని సెషన్లలో భారత మార్కెట్లలో అస్థిరమైన ట్రేడింగ్ సెషన్ చూశాం. అయితే, ఇవాళ శుక్రవారం నిఫ్టీ, సెన్సెక్స్ తదితర మార్కెట్ సూచీలు ఒక అద్భుతమైన బ్రేక్‌అవుట్‌ను చూశాయి.

Stock Markets Closing: కనుచూపు మేర పచ్చని పైరులా నేటి స్టాక్ మార్కెట్లు
Stock Markets Closing

బిజినెస్ డెస్క్: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య గత కొన్ని సెషన్లలో భారత మార్కెట్లలో అస్థిరమైన ట్రేడింగ్ సెషన్ చూశాం. అయితే, ఇవాళ శుక్రవారం నిఫ్టీ, సెన్సెక్స్ తదితర మార్కెట్ సూచీలు ఒక అద్భుతమైన బ్రేక్‌అవుట్‌ను చూశాయి. నిఫ్టీ ఏకంగా ఇవాళ 319 పాయింట్లు అధికంగా పైకి ఎగసింది. ఈ ఉదయం సానుకూల సంకేతాలతో మొదలైన తర్వాత, మార్కెట్ సెషన్ ప్రారంభంలో బాగా పెరిగింది. సెషన్ మధ్యలో నుండి చివరి వరకు అప్‌సైడ్ మొమెంటం కొనసాగింది. ఇలాగే కదిలి నిఫ్టీ గరిష్ట స్థాయిల దగ్గర ముగిసింది.


మార్కెట్లు ముగిసే సమయానికి, సెన్సెక్స్ 1,046.30 పాయింట్లు లేదా 1.29 శాతం పెరిగి 82,408.17 వద్ద ఉంది. నిఫ్టీ 319.15 పాయింట్లు లేదా 1.29 శాతం పెరిగి 25,112.40 వద్ద స్థిరపడింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.2 శాతం పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం పెరిగింది. మెటల్, పిఎస్‌యు బ్యాంక్, రియాల్టీ, పవర్, టెలికాం, క్యాపిటల్ గూడ్స్ 1-2 శాతం పెరిగాయి. దాదాపు అన్ని రంగాల సూచీలు ఇవాళ గ్రీన్‌లో ఉన్నాయి. జియో ఫైనాన్షియల్, ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్‌టెల్, భారత్ ఎలక్ట్రానిక్స్, ట్రెంట్ నిఫ్టీలో అత్యధిక లాభాలను ఆర్జించగా.. హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, మారుతి సుజుకి, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ వంటి సంస్థలు నష్టపోయాయి.

గత మూడు సెషన్లలో డౌన్ నారో రేంజ్ మూమెంట్ ఏర్పడిన తర్వాత రోజువారీ చార్ట్‌లో ఇవాళ లాంగ్ బుల్ క్యాండిల్ పడంది. ఈ మార్కెట్ గమనం నిర్ణయాత్మక అప్‌సైడ్ బ్రేక్‌అవుట్‌ను సూచిస్తుంది. వీక్లీ చార్టులో నిఫ్టీ గత వారం పదునైన లాంగ్ బుల్ క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. బలమైన యూరోపియన్ మార్కెట్ సంకేతాలు.. సానుకూల డౌ ఫ్యూచర్స్ స్థానిక బెంచ్‌మార్క్‌లలో భారీ ర్యాలీని ప్రేరేపించడంతో మార్కెట్లు కన్సాలిడేషన్‌ను చూశాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

లామ్నుంథెం సింగ్సన్‌కు కడసారి వీడ్కోలు.. భారీగా తరలి వచ్చిన ప్రజలు

ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు.. గిఫ్ట్‌లు వైరల్

For National News And Telugu News

Updated Date - Jun 20 , 2025 | 05:03 PM